NBK 108: విజయదశమికి బాలయ్య ఆయుధ పూజ.. విడుదలపై క్లారిటీ వచ్చేసింది.. కిక్కిచ్చేలా మరో లుక్!
నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా విడుదల తేదీ పై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ మరొక అద్భుతమైన పోస్టర్ విడుదల చేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది పోస్టర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే...

అంతకుమించి అనేలా..
నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఆడియెన్స్ ఎంజాయ్ చేసే అంశాలు పుష్కలంగా ఉంటాయి అని చాలాసార్లు రుజువు చేశారు. అయితే ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య బాబు అంతకుమించి అనేలా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో డిఫరెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుందట.

పవర్ఫుల్ డైలాగ్స్
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఈ సినిమా ద్వారా ఒక తెలంగాణ భాషతో మాట్లాడబోతున్నాడు. సినిమా మొత్తంలో కూడా బాలయ్య టైమింగ్ డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయట. ఆయన చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ తెలంగాణలో ఎలా ఉంటాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకోసం అనిల్ రావిపూడి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎమోషనల్ కంటెంట్ కూడా
సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా హైలెట్ కాబోతుందట. బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురి పాత్రలో యువ హీరోయిన్ శ్రీలీల కనిపించబోతోంది. ఈ విషయంపై కూడా ముందుగానే చిత్ర యూనిట్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. మంచి ఫ్యామిలీ సీన్స్ తో పాటు యాక్షన్ కంటెంట్ కూడా హై లెవెల్లోనే ఉంటుందని టాక్.

విజయదశమికి ఆయుధ పూజ
ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ ను కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టాడు. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అతను టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. మొత్తానికి సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ సినిమాను ఈ ఏడాది విజయదశమి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా విజయదశమికి ఆయుధ పూజ అంటూ ఒక పవర్ఫుల్ లైన్ కూడా మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది.

డేట్ ఫిక్స్ అయినట్లే..
ఈ ఏడది అక్టోబర్ 24న విజయదశమి పండగ ఉంది కాబట్టి సినిమా రెండు రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే అదే సమయంలో మరో రెండు సినిమాలు కూడా పోటీకి వచ్చే అవకాశం ఉంది. అందులో రామ్ పోతినేని బోయపాటి సినిమా కూడా ఉండగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా అదే సమయానికి వస్తుందని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోటీలో ఒక సినిమా వెనుకడుగు వేయవచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











