బాలయ్యకు విలన్‌గా మంచు హీరో... గోపీచంద్ మలినేని బిగ్ అనౌన్స్‌మెంట్!
66 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసపెట్టి సినిమాలు చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్‌బీకే 111 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్‌ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని రివీల్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
గతంలో వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణకు హిట్ అందించారు గోపీచంద్ మలినేని. దాంతో వీరిద్దరి కాంబోపై సినీ పరిశ్రమలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భగవంత్ కేసరి తర్వాత బాలయ్యతో ఆమె నటిస్తోన్న రెండో సినిమా కావడం విశేషం. వీరితో పాటు మలయాళ బ్యూటీ హనీరోజ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇదిలాఉండగా.. ఎన్‌బీకే 111కు సంబంధించి దర్శకుడు గోపీచంద్ మలినేని క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ.. ఎన్‌బీకే 111లోకి స్వాగతమని ఆయన ట్వీట్ చేశారు. ఆ వెంటనే మంచు మనోజ్ ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు.
నా పుట్టినరోజులు దేవుడిచ్చిన వరాలు మాదిరిగా వస్తాయి. నా జీవితంలో నేను ఎంతో ఆశగా కోరుకున్న ప్రత్యేకమైన బహుమతిని ఈ బర్త్ డే నాకు తెచ్చిపెట్టింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నా కల నిజమవుతోంది. లయన్ ఎన్‌బీకే బాలయ్య అన్నతో కలిసి నటించాలనే నా ఎన్నో ఏళ్ల కల నిరీక్షణ గోపీచంద్ మలినేని గారి సినిమాతో నెరవేరుతోంది. ఈ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా , నా మనసుకు దగ్గర చేసింది. రాబోయే రోజుల్లో ఎన్ని సినిమాలు చేసినా.. బాలయ్య అన్నపై, గోపీచంద్ గారితో నాకున్న గౌరవంతో ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెబుతున్న వారికి పేరు పేరునా ధన్యవాదాలు. ఈసారి థియేటర్‌లలో మీకు పెద్ద విందు భోజనం ఉంటుంది. ఈ ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు.
కాగా గతంలో నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్‌లు ఊ కొడతారా ఉలిక్కిపడతారా మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో కనిపించి అభిమానులను అలరించారు. ఇప్పుడు బాలకృష్ణ కోసం మనోజ్ రంగంలోకి దిగారు. ఇదిలాఉండగా.. ఎన్‌బీకే 111లో మంచు మనోజ్ విలన్‌గా నటించనున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. హీరోగా నటిస్తూనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మంచు మనోజ్ సత్తా చాటుతున్నారు. ఇటీవల వచ్చిన మిరాయ్, భైరవం వంటి సినిమాలలో మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నారు. అలాంటిది ఏకంగా నందమూరి బాలకృష్ణను విలన్‌గా ఢీకొడుతూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నందమూరి- మంచు అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications


