Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
వికారాబాద్ అడవుల్లో నందమూరి బాలకృష్ణ: ఆ తెలుగు హీరోతో ఫైట్ చేస్తున్నాడట
చాలా కాలంగా సరైన హిట్ లేక బాగా ఆకలితో ఉన్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిశాడు. గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి హిట్లను అందుకున్న ఈ జోడీ ప్రస్తుతం చేస్తున్న చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
తాజా సమాచారం ప్రకారం.. 'అఖండ' మూవీ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరుగుతుందట. అక్కడ నందమూరి బాలకృష్ణతో పాటు మరో హీరో శ్రీకాంత్‌పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో భాగంగానే వీళ్లిద్దరి మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా తీస్తున్నారని సమాచారం. ఇదంతా ఇటీవల టైటిల్ రోర్ వీడియోలో కనిపించిన అఘోరా పాత్రకు సంబంధించిన పార్ట్ అని అంటున్నారు. దాదాపు పది పదిహేను రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ ప్రాంతంలో జరగనుందని తెలుస్తోంది.
'అఖండ'లో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పవర్ఫుల్ రైతు పాత్ర కాగా.. మరొకటి అఘోరా రోల్. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మే 28న విడుదల కాబోతుంది.