మంచు మనోజ్‌పై నందమూరి వసుంధర సీరియస్ .. ఆ పనులొద్దంటూ వార్నింగ్
గడిచిన కొద్ది నెలల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో ఒక కాంట్రవర్సీ హైలైట్‌గా వినిపిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది యువ హీరో రాజ్ తరుణ్ నుంచి మొదలైన రచ్చ ఇపుడు మరిన్ని ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి. వీటిలో కొన్ని అంశాలకు చెక్ పడగా.. ఇప్పటికీ డైలీ సీరియల్‌లా సాగుతున్న ఎపిసోడ్ మాత్రం మంచు వారి తగాదాలు అని చెప్పాలి. స్వయంగా తన తండ్రే తనపై దాడులు చేస్తున్నాడు, చేయిస్తున్నారు అంటూ మంచు మనోజ్ రోడ్డెక్కడం టాలీవుడ్‌లో షాకింగ్ గా మారింది. మోహన్ బాబు కూడా మనోజ్‌పై రివర్స్‌లో కేసు పెట్టడంతో వీరి కాంట్రవర్సీ మాత్రం అంతకంతకూ హీట్ పెంచుతుంది.
మరోవైపు.. తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలని మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను అభ్యర్ధించారు. అలాగే తన ఆస్తులను కాపాడాలని.. ఇదంతా తాను కష్టపడి సంపాదించినదేనని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 3వ తేదీన మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఆయన ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఏకంగా కలెక్టర్ ఎదుటే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దాదాపు రెండు గంటల పాటు తండ్రీకొడుకులను విచారించిన జిల్లా కలెక్టర్.. మరోసారి తన ఎదుట హాజరవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో తమ వద్ద ఉన్న ఆస్తి డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు మోహన్ బాబు, విష్ణులు వేర్వేరుగా అందజేశారు. దీంతో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అలాగే మంచు మనోజ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారోనని ఫిలింనగర్ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
అలాంటిది మంచు మనోజ్‌కు హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది ఈ గొడవతో ఏ సంబంధం లేని విషయం. ఈ వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు ఓ రోజున మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని వీరు గుర్తుచేసుకున్నారు. నీ పక్కన విలన్‌గా చేయడానికి నేనెప్పుడూ రెడీ అన్న మోహన్ బాబు.. సొంత బ్యానర్ అయితే దీపావళి ముందు అడ్వాన్స్ పంపించమని చెబుతారు.
మాటల సందర్భంలో చిన్నప్పుడు మనోజ్‌కు - బ్రాహ్మాణికి గొడవ జరిగిన విషయాన్ని గుర్తుచేస్తాడు బాలయ్య. ఏడిపిస్తుంటే బ్రాహ్మణిని మనోజ్ కొట్టాడని దీంతో నా కూతురు కంప్లయంట్ చేసిందని, వసుంధర కూడా కన్ఫర్మ్ చేసిందని బాలకృష్ణ తెలిపారు. ఆ సమయంలో వసుంధర వచ్చి మనోజ్‌ని మందలించారని మంచు విష్ణు చెప్పడంతో అంతా నవ్వేస్తారు. నాన్నగారికి షూటింగ్‌లో పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బాలకృష్ణ గారు మాకు అండగా నిలిచారని మంచు లక్ష్మీ, విష్ణులు గుర్తుచేసుకున్నారు. చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని తీసుకెళ్లి ఉస్మాన్ రోడ్‌లో బొమ్మలు కొనిచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











