Aditya 369 4K: ఆదిత్య 369 గ్రాండ్ రీ రిలీజ్.. 4K టెక్నాలజీతో విడుదల ఎప్పుడంటే?

ఇండియాలో తొలి టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్‌తో సైంటిఫిక్, ఫిక్షన్, హిస్టారికల్ చిత్రంగా రూపొందిన సినిమా ఆదిత్య 369. అప్పట్లోనే అత్యాధునిక సాంకేతికతో ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసిన ఈ చిత్రం కలెక్షన్లు, రికార్డుల పరంగా సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. ఈ సినిమా నేటి జనరేషన్ తగినట్టుగా లేటేస్ట్ టెక్నాలజీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ హీరోగా స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై రూపొందింది. తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాను ప్రస్తుతం టెక్నాలజీ 4K సాంకేతికతో డిజిటైలైజేషన్ పూర్తి చేసుకొని ఈ వేసవిలో సినిమా లవర్స్‌ను కొత్త అనుభూతికి లోనయ్యేలా గ్రాండ్‌గా రీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

Nandamuri Balakrishna s Aditya 369 movie 4K Version Re Release Here is release date details

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మొదటి సినిమాగా పేరొందిన ఈ చిత్రం శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందింది. శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన, సింగీతం దర్శక నైపుణ్యం, ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గాత్రం, సమర్పణ, జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా అద్భుత సంగీతం, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, ఇతర నటీనటుల ప్రతిభ, అబ్బుర పరిచే సెట్స్, ఫైట్స్, దుస్తులు, నృత్యం ఇలా ప్రతీ ఒక్కరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలు పోషించారు.

ఆదిత్య 369 రీ- రిలీజ్ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... " ఆదిత్య 369 మొదటి సారి విడుదల సమయంలో ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నానో, ఇపుడు రీ - రిలీజ్ కి కూడా అలాగే ఉన్నాను. ఎన్ని సార్లు చూసినా కనువిందు చేసే ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని డిజిటల్ 4K లో ఇంకా అద్భుతంగా తీర్చదిద్దాo. అన్ని వయసుల, వర్గాల ప్రేక్షకులని, నందమూరి అభిమానులను అలరించిన ఈ చిత్రాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఒక గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది 'ఆదిత్య 369' తోనే. ఈ సమ్మర్ లో గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

Nandamuri Balakrishna s Aditya 369 movie 4K Version Re Release Here is release date details

ఇప్పుడు వస్తున్న టైమ్ ట్రావెల్ సినిమాలకు స్పూర్తిగా నిలిచిన ఆదిత్య 369 త్వరలోనే రీ రిలీజ్ కానున్నది. ఈ సినిమా నేటి తరాల ప్రేక్షకులను మైమరిపించే అంశాలు ఎన్నో ఉన్నాయి. నేటి తరం దర్శకులకు స్పూర్తిగా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ ద్వారా మరోసారి సంచలన విజయం సాధిస్తుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు, అభిమానులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X