Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు ట్రీట్... అఖండ 2 పాటలన్నీ ఒకేసారి రిలీజ్... హైలైట్‌గా ఆ సాంగ్
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 చిత్రం పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అమలాపురం నుంచి అమెరికా వరకు అఖండ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. విడుదలకు ముందే అభిమానులకు బాలయ్య ట్రీట్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే...
అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

అఖండ 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అంతా శివమయం
తాజాగా రిలీజ్‌కు ముందు బాలయ్య అభిమానులకు చిత్ర యూనిట్ ట్రీట్ ఇచ్చింది. అఖండ 2లోని అన్ని పాటల ఆడియో ట్రాక్‌లను విడుదల చేసింది. ఈ జ్యూక్ బాక్స్‌లో మొత్తం 9 పాటలు ఉండగా.. ఒక్క జాజికాయ సాంగ్ తప్పించి అన్నీ శివుడి మీదే ఉండటం విశేషం. గంగాధర శంకర, హరహర, శంభో, శివ శివ తదితర పాటలు శివుని గొప్పతనాన్ని ఆవిష్కరించాయి. ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ వంటి వారు అఖండ 2లోని సౌండ్ ట్రాక్స్‌ను ఆలపించారు. భక్తి, విశ్వాసం, ఆగ్రహం అనే ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ అఖండ 2 పాటలను తీర్చిదిద్దినట్లుగా ఫిలింనగర్ టాక్.
హైలైట్‌గా సర్వేపల్లి సిస్టర్స్
అలాగే హైందవం అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు నాగ గురునాథ శర్మ సాహిత్యం అందించగా.. సర్వేపల్లి సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన శ్రేయ, రాజ్యలక్ష్మీలు ఆలపించారు. ఎప్పటిలాగే థమన్ తనదైన బీట్స్‌తో ఆకట్టుకున్నారు. శివుడు, హైందవ ధర్మం గురించి చెబుతూ సాగుతున్న ఈ పాట ఇప్పటికే మాస్‌ను ఊపేస్తోంది. దీనితో పాటు అఖండలో వేదమంత్రాలు, సంస్కృత శ్లోకాలు కూడా కథానుగుణంగా వినిపిస్తాయని టాలీవుడ్ టాక్. దీనికి తగినట్లుగానే బోయపాటి స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు. ఇందుకోసం వేద పఠనంలో నిష్ణాతులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రాలు ఈ అఖండ 2లో భాగమైనట్లుగా చెబుతున్నారు. మరి అఖండ తాండవం ఎలా ఉందో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ ఆడియో ట్రాక్.. అఖండ 2పై అంచనాలను పెంచేసింది.


Click it and Unblock the Notifications











