లైవ్‌లో ఊడిన బాలయ్య మీసం.. అలాంటి కామెంట్స్‌తో దారుణంగా ట్రోలింగ్

సినిమాలలో పాత్రలు, కథ డిమాండ్ మేరకు కొందరు హీరోలు, హీరోయిన్లు విగ్గులు పెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నటీనటులు తమ వయసు కవర్ చేసుకోవడానికి విగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టూ బాలీవుడ్‌ ఇలాంటి వారెందరో. వీరిలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. సినిమాలతో పాటు బయట కూడా ఆయన విగ్ పెట్టుకునే కనిపిస్తారు.

బాలయ్య విగ్గుపై రగడ
బాలకృష్ణ విగ్గుపై పలువురు కామెంట్స్ చేస్తుంటారు. మొన్నామధ్య ఏపీ ఎన్నికల సమయంలో బాలయ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా దీనికి తనదైన శైలిలో కౌంటరిచ్చారు బాలకృష్ణ. అప్పట్లో కార్‌వాన్‌లు లేవని.. చాప, దిండు వేసుకుని నేలపై పడుకునే వాళ్లమన్నారు. మొన్న ఎవడో వెధవ .. నేను విగ్గు పెట్టుకుంటానని ఎగతాళితగా మాట్లాడాడని మండిపడ్డారు. నేను విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా అని పరోక్షంగా కొడాలి నానికి కౌంటరిచ్చారు బాలకృష్ణ.

Nandamuri Balakrishna s Fake Mustache Fallen During His Birth Day Celebrations

బాలయ్యపై కేఎస్ రవికుమార్ వ్యాఖ్యలు
మరో ఘటనలో బాలయ్య విగ్గు విషయంలో చోటు చేసుకున్న ఘటనను దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రస్తావించారు. ఓసారి సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్.. బాలయ్య వైపు ఫ్యాన్ పెట్టడంతో ఆ గాలికి బాలకృష్ణ విగ్గు కదిలిందని దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయినట్లు చెప్పారు. తాను వెంటనే పరిస్ధితిని చక్కదిద్దకపోయుంటే ఆ వ్యక్తి చెంప పగిలిపోయేదని నవ్వుతూ చెప్పారు రవికుమార్. బాలయ్యది చాలా మంచి మనసని, భోళా వ్యక్తి అని ప్రశంసించారు.

విగ్గుల కోసమే లక్షల్లో ఖర్చు
బాలకృష్ణ విగ్గులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారని ఆయన వ్యక్తిగత మేకప్ మెన్ వాసు తెలిపారు. అవి ఎంతో క్వాలిటీవీ, కాస్ట్‌లివీ అయ్యుంటాయని చెప్పారు. విగ్గుల కోసమే బాలయ్య లక్షల్లో ఖర్చు చేస్తారని వాసు వెల్లడించారు. గతంలో ముంబై లేదా చెన్నై నుంచి బాలయ్యకి విగ్గులు తెప్పించేవారమని, ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్‌లోనే దొరుకుతున్నాయని అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది దసరా కానుకగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రసంగం మధ్యలో ఊడిపోయిన మీసం
ఇదిలాఉండగా మరోసారి బాలయ్య, మీసం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ కేక్ కట్ చేసి మాట్లాడుతుండగా ఆయన పెట్టుకున్న మీసం ఊడిపోయింది. దీంతో వేదికపై ఉన్నవారు, అభిమానులు షాకయ్యారు. కానీ బాలయ్య మాత్రం వెంటనే తేరుకుని గమ్ తీసుకురమ్మంటూ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. గమ్‌తో మీసాలను అతికించుకుని తిరిగి యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీటికి బాలయ్య అభిమానులు కౌంటరిస్తుండటంతో ఇది కాస్తా ఫ్యాన్ వార్‌గా మారింది. మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: nandamuri balakrishna akhanda 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X