బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అసలైన పండుగ మహాశివరాత్రి రోజే.. ఎందుకో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే చిత్రాలు చేస్తూ.. హిట్ ల మీద హిట్ లు కొడుతున్నారు. అద్భుతమైన మాస్ చిత్రాలలో కనిపిస్తూ.. అంతకు మించిన స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తున్నాడీ సీనియర్ హీరో. అయితే ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియో విడుదల చేయబోతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే భగవంత్ కేసరి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య బాబు అదే ఊపులో.. తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. NBK 109 చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన త్రిషతో పాటు మీనాక్షి చౌదరి నటించబోతుంది. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ వంటి స్టార్లను తీసుకున్నారు. వీరు మాత్రమే కాకుండా మరో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి కూడా ఈ సినిమాలో అవకాశం దక్కినట్లు స్వయంగా ఆమే ప్రకటించింది. ఇలా క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.
ఈ సినిమాను 1980 దశకం నాటి కథతో రూపొందించబోతున్నట్లు, ఈ సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా చిత్రబృందం ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

ఎక్స్ వేధికగా.. బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలెస్ట్ రూపాన్ని మహాశివరాత్రి రోజు చూడవచ్చని తెలిపింది. మరి ఈ సినిమాలో బాలయ్య బాబు ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారో రేపటితో తెలియబోతుంది. ఈ వార్త తెలుసుకున్న బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఇది కదా అసలైన పండుగ సమయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేపు రాబోయే గ్లింప్స్ చూసి శివరాత్రిని మరింత సంబురంగా జరుపుకుంటామంటూ వివరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











