ఆరోజు బాలయ్య గ్రాండ్ సర్​ప్రైజ్​ - ఇక బాక్సాఫీస్​కు ఊచకోతే - చూసేందుకు మీరు రెడీయా?

చేసిన సినిమాలు చేసినట్టు వరుసపెట్టి పోతుంటే నందమూరి బాలకృష్ణ పని అయిపోయింది ఇక అని అంతా అనుకున్నారు. అగ్రహీరో అయిన ఆయన చిత్రం కనీసం రూ.20కోట్లైనా వస్తాయన్న డౌట్ స్టేజ్​కు వెళ్లిపోయారంతా. అలాంటి సమయంలో ఒకటొచ్చింది అదే లెజండ్​. 2014 మార్చ్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. నందమూరి అభిమానుల్లో ఊపిరి పోసింది. ఇప్పుడా సినిమానే మళ్లీ బాక్సాఫీస్​ దగ్గర ఊపేందుకు రెడీ అవుతోంది. రీరిలీజ్​కు సిద్ధమైంది. దీని గురించి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

మాస్ డైరెక్టర్​ బోయపాటి శ్రీను వచ్చిన కొత్తలో భద్ర, తులసి వంటి చిత్రాలు చేసి బాగానే ఆకట్టుకున్నారు. అలా ఆ తర్వాత 2009లో బాలకృష్ణతో తన మూడో చిత్రంగా సింహాను చేసి భారీ బ్లాక్ హిస్టర్ కొట్టారు. ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ఊపిరి పోశారు. దీంతో బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కారని అంతా ఆశించారు. కానీ మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఆయన చేసిన పరమవీరచక్ర, అధినాయకుడు, రామ రాజ్యం, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, శ్రీమన్నారాయణ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

Nandamuri Balayya Boyapati Legend Movie Rerelease Date March 30th Full Details Here

దీంతో బాలయ్యకు సరైన హట్ దొరకడం మళ్లీ కష్టం అని అనుకున్న సమయంలో మళ్లీ తిరిగొచ్చాడు బోయపాటి. సింహా సినిమా ఊహించని సంచలనం సృష్టించటంతో లెజెండ్​పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనుకున్నట్టే 2014 మార్చి 28న వచ్చిన లెజెండ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊచకోత కోసింది. జయదేవ్‌ (లెజెండ్‌), కృష్ణ పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఆకట్టుకున్నారు. ఈ సినిమా 31 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమై దుమ్మురేపింది. ఓ థియేటర్‌లో అయితే ఏకంగా 1000 రోజులు ప్రదర్శితమై సరికొత్త రికార్డను క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమాకు బాలకృష్ణ నటన ఒక ఎత్తైతే, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. విలన్​గా జగపతి బాబు నటన ఇంకొక ఎత్తు. ఈ మూడు ప్రేక్షకుల్లో ఊపు తెప్పించేశాయి. ముఖ్యంగా జగపతి బాబు కెరీర్​ను మార్చేసింది. చిత్రంలోని డైలాగ్స్​ అయితే మరో సంచలనం. బాలయ్య కెరీర్‌లో మొదటి రూ. 40 కోట్ల షేర్ అందుకున్న చిత్రం కూడా ఇదే. ఇక చిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు.

Nandamuri Balayya Boyapati Legend Movie Rerelease Date March 30th Full Details Here

ఇక ఇప్పుడీ చిత్రం మళ్లీ రీరిలీజ్​కు రెడీ అయింది. సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా మార్చి 30న వరల్డ్ వైడ్​గా మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీరిలీజ్​ రోజు పెద్ద పండగే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లో ఈ సినిమా కలెక్షన్స్​ వివరాల విషయానికొస్తే బయట దొరికిన కథనాల ప్రకారం నైజాంలో 9.41 కోట్లు, సీడెడ్ 8.40 కోట్లు, ఉత్తరాంధ్ర 3.68 కోట్లు, ఈస్ట్ 2.25 కోట్లు, వెస్ట్ 2.21 కోట్లు, గుంటూరు 4.14 కోట్లు, కృష్ణా 2.30 కోట్లు, నెల్లూరు 1.70 కోట్లు వసూలు చేసిందట. ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ రూ.34.09 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇక కర్ణాటక 3.25 కోట్లు, ఓవర్సీస్ 1.55 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.50 కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రూ. 40.39 కోట్లు షేర్ వచ్చిందట. మరి రీరిలీజ్​లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X