నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. హాస్పిటల్ నేపథ్యంలో 'బ్రీత్'.. టీజర్ రివ్యూ

తెలుగు సినీ ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ నటవారసులుగా గ్లోబల్ లయన్ బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోపాటు హీరోగా కల్యాణ్ రామ్ కూడా ఆకట్టుకున్నాడు. హరికృష్ణ, తారక రత్న సైతం పలు సినిమాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. ఇప్పుడు ఎక్కువగా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ హీరోగా రావాలని అభిమానులు కోరుకున్నారు. కానీ అతని కంటే ముందుగానే నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో దిగాడు. అతనే నందమూరి చైతన్య కృష్ణ. ఆయన నటించిన బ్రీత్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వదిలారు.

Nandamuri Chaitanya Krishna Breathe Movie Teaser Released

బ్రీత్ మూవీతో నందమూరి కుటుంబం నుంచి మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. అతనే నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకే చైతన్య కృష్ణ. బ్రీత్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. బ్రీత్ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Nandamuri Chaitanya Krishna Breathe Movie Teaser Released

నందమూరి చైతన్య కృష్ణ నటించిన బ్రీత్ సినిమాకు వైద్యో నారాయణ హరి అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా వైద్యం, హాస్పిటల్స్ కు సంబంధించిన కథాంశంతో రూపొందినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఓ హాస్పిటల్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీగా బ్రీత్ ఉండనుంది. ఇక ఇందులో చైతన్య కృష్ణ ఒక రోగి పాత్రలో నటించి మెప్పించనున్నాడు. ఇంట్రెస్టింగ్, సస్పెన్స్ అంశాలతో టీజర్ నింపేశారు. పెద్దగా డైలాగ్స్ లేకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ కట్ చేశారు. బీజీఎమ్ మరింత ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది.

Nandamuri Chaitanya Krishna Breathe Movie Teaser Released

టీజర్ తో బ్రీత్ సినిమాపై అంచనాలు పెంచేశారు. కాగా ఈ సినిమాను వంశీ కృష్ణ ఆకేళ్ల రచించి, దర్శకత్వం వహించారు. ఆయన గతంలో రక్ష (2008), ది ట్రిప్ (2021) వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చైతన్య కృష్ణ తండ్రి తన బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. అంతేకాకుండా వారి బ్యానర్ లో వస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషాని, సహస్ర కీలక పాత్రలు పోషించనున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, 8AM మెట్రో సినిమాలకు సంగీతం అందించిన మార్క్ కె రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X