Nandamuri Hero: లక్ష్మీ పార్వతి శని, క్యారెక్టర్ లెస్... నందమూరి హీరో సంచలన వ్యాఖ్యలు
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రెండో కుమారుడు జయకృష్ణ, ఆయన కుమారుడు చైతన్య కృష్ణ మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఈ హీరో గత 20 ఏళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అవేంటో ఈస్టోరీలో తెలుసుకుందాం.
ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే లక్ష్మి పార్వతిపై నందమూరి చైతన్య కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా... ఎన్టీఆర్ రెండో భార్య అయినటు వంటి లక్ష్మీ పార్వతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలోకి వచ్చిన శని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చెేశారు.

లక్ష్మీ పార్వతి తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన తరవాత అసలు మంచి జరగలేదని అంటూ ఆరోపించారు కృష్ణ చైతన్య. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తాజాగా బ్రీత్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన తండ్రి జయకృష్ణ నిర్మాతగా వ్యహారిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు.

అయితే చైతన్య కృష్ణ తొలి సినిమా ఇది కాదు.. 20 ఏళ్ల క్రితమే అంటే 2003లో చైతన్య కృష్ణ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ధమ్ అనే సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. అసలు ఆ సినిమా ఉందనే విషయం ఎవరికీ తెలియదు. ప్రేక్షకులు కూడా ఎవరు ఆయన్నీ గుర్తించలేదు. ఇక చైతన్య కృష్ణ కూడా మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఇప్పుడు మళ్లీ 20 ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు.
తాజాగా చైతన్య కృష్ణ 'బ్రీత్' సినిమాతో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చైతన్య కృష్ణ. అలా... ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతన్య కృష్ణ.. లక్ష్మీ పార్వతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు అవాస్తమని... లక్ష్మీ పార్వతిని ఇబ్బంది పెట్టారనేది అబద్ధమని తెలిపారు.

లక్ష్మీ పార్వతి వల్లే మాకు మంచి జరగలేదు.. ఆమె పార్టీని లాగేసుకునే పనిలో ఉంది. మా ఫ్యామిలీలోకి శని లాగా వచ్చింది. పార్టీని కాపాడడానికి అప్పుడు చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారే తప్ప... తప్పుడు ఉద్దేశంతో కాదు అని చెప్పుకువచ్చారు. అంతే కాదు.. అసలు ఆమె మంచి ఆడది కాదు.... క్యారెక్టర్ లెస్ లేడీ.... ఒక శని మా ఇంటికి వచ్చింది... అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి హీరో ఇలా లక్ష్మీ పార్వతిపై డైరెక్ట్ అటాక్ చేయడంపై నెటిజన్స్ నోరేళ్ల బెడుతున్నారు.


Click it and Unblock the Notifications











