దబిడి దిబిడిపై ట్రోలింగ్ .. మహేశ్, అల్లు అర్జున్‌లను లాగిన బాలయ్య ఫ్యాన్స్

టాలీవుడ్‌కి దశాబ్ధాలుగా నాలుగు స్తంభాలుగా ఉన్న నలుగురు అగ్రహీరోలలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన బాలయ్య.. ఎన్నికలో గెలిచి హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ద్వారా ఓటీటీలోనూ హోస్ట్‌గా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో డాకు మహారాజ్ చేస్తున్నారు బాలయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది.

వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో పాటు బాలయ్యను ఫస్ట్ టైం టేకప్ చేస్తుండటంతో డాకు మహరాజ్‌పై భారీ అంచనాలున్నాయి. వీటిని అందుకునేందుకు చిత్ర యూనిట్ కూడా అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే విడులైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో జనవరి 12 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

nandamuri fans counter to trollers who slams balakrishna s daaku maharaj dabidi dibidi song dance with urvashi rautela

అమెరికాలోని డల్లాస్‌లో నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఇప్పటికే డల్లాస్‌లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఒకటి జరగ్గా ఆ తర్వాత ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు ఏమాత్రం తగ్గని రేంజ్‌లో డాకు మహారాజ్ కార్యక్రమం నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేకాదు.. బాలయ్య కెరీర్‌లో తొలిసారి అమెరికాలో ఓ సినిమా ఈవెంట్ జరుగుతుండటం విశేషం.

డల్లాస్‌తో పాటు మరో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జనవరి 7న, అనంతపురంలో జనవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈ రెండు ఈవెంట్స్‌కు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరుకానున్నారు. దీనికి తోడు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలోనూ డాకు మహరాజ్ చిత్ర యూనిట్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

డాకు మహారాజ్ ప్రమోషనల్‌లో భాగంగా ఈ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బాలయ్య, ఊర్వశి రౌటేలాలు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. యూట్యూబ్‌ను ఈ పాట షేక్ చేస్తూ పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంటోంది. అయితే హీరోయిన్ నడుము, పిరుదులపై బాలయ్య దరువు వేయడంతో పాటు నాభి భాగంలో చేయి వేసి ఊర్వశి డ్రెస్‌ను పట్టుకునే సీన్ ఉండటంతో నెటిజన్లు మరోసారి రెచ్చిపోతున్నారు. కూతురు వయసున్న హీరోయిన్‌తో ఇలాంటి స్టెప్స్ వేస్తారా? కొరియోగ్రాఫర్‌కు బుద్ధి ఉందా అంటూ ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు ట్రోలింగ్‌పై ఎదురుదాడికి దిగారు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి హిట్, పుష్ప 2లో పీలింగ్స్ సాంగ్ హిట్, డాకు మహారాజ్‌లో దబిడి దిబిడి హిట్.. ఈ మూడు పాటలు రిలీజైనప్పుడు తిట్టారు, ట్రోలింగ్ చేశారు. పై రెండు సినిమాలు హిట్.. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా హిట్ అవుతుందని ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా ట్రోలర్స్ ఎలాంటి కామెంట్స్ పెడుతారనోనని ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X