Boycott Laila: వీధి కుక్కల అరుపులకు భయపడం.. విశ్వక్ కు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్

వరుస సినిమాలతో జోరు మీదున్నారు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు విశ్వక్‌సేన్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం లైలా. కెరీర్‌లో ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడంతో పాటు లేడీ గెటప్ వేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌సేన్ లుక్స్ వైరల్ అయ్యాయి. వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న లైలా ప్రేక్షకుల ముందుకురానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా లైలా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఫిబ్రవరి 9న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలు ఆసక్తికర ఘటనకు వేదికైంది. విశ్వక్‌సేన్ నందమూరి హీరోల వర్గమని, వేరే హీరోలతో అంటిముట్టనట్లుగా ఉంటారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు.

Nandamuri fans supports to hero vishwak sen laila movie While ysrcp activists boycott laila campaign

ఇండస్ట్రీలో ఒకటే కాంపౌండ్ ఉంటుందని అందరిదీ సినిమా కాంపౌండ్ అని వ్యాఖ్యానించారు. అలాగే తన ప్రజారాజ్యం పార్టీ సంగతులను కూడా మెగాస్టార్ ప్రస్తావించారు. ప్రజారాజ్యం పార్టీ .. జనసేనగా రూపాంతరం చెందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆశయాలు , సిద్ధాంతాలు తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నాడని ఆయనకు తన పూర్తి మద్ధతు ప్రకటించడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇక లైలా ప్రీ రిలీజ్ వేడుకలో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్‌లో నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని , కరెక్ట్‌గా లెక్కేస్తే 11 గొర్రెలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్‌కు దిగారు వైసీపీ అభిమానులు.

Nandamuri fans supports to hero vishwak sen laila movie While ysrcp activists boycott laila campaign

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహూ గారపాటిలు మీడియా ముందుకొచ్చి వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. ఎంతో కష్టపడి తీశామని.. సినిమాను చంపేయొద్దని రిక్వెస్ట్ చేశారు. జరిగిన దాంట్లో మా ప్రమేయం లేదని, ఒక వ్యక్తి చేసిన తప్పుకు నేనేందుకు బలవ్వాలని ప్రశ్నించారు. అయినప్పటికీ వైసీపీ అభిమానులు బాయ్‌కాట్ లైలా క్యాంపెయినింగ్ చేస్తూనే ఉన్నారు.

నందమూరి అభిమానులు తోడుగా వున్నంత వరకు వీధి కుక్కల బెదిరింపులకు భయపడేది లేదు...We are With Vishwak Sen

Posted by Dinesh Muthineni on Tuesday 11 February 2025

ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌కు గట్టి మద్ధతు దొరికింది. నందమూరి అభిమానులంతా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభిమానులకు వీరు సోషల్ మీడియాలో కౌంటరిస్తూ లైలా సినిమాకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ నందమూరి అభిమాని పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు తోడుగా వున్నంత వరకు వీధి కుక్కల బెదిరింపులకు భయపడేది లేదని వుయ్ ఆర్ విత్ యూ విశ్వక్‌సేన్ అంటూ ఆ వ్యక్తి పోస్ట్ పెట్టాడు. చూస్తుంటే ఫ్యాన్ వార్ కాస్తా పొలిటికల్ వార్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. లైలా రిలీజ్ అయితే కానీ ఏం జరుగుతుందనేది తెలియదు.

More from Filmibeat

Read more about: ysrcp vishwak sen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X