తాతను తలచుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్.. మెగాస్టార్ స్వీట్ మెమొరీ!

తెలుగు సినిమా చరిత్రలో ఎదురులేని మనిషిలా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును దక్కించుకున్న నటుడు నందమూరి తారక రామారావు. నేడు ఆయన జయంతి సందర్భంగా అభిమానులతో పాట స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తాత గురించి ఎమోషనల్ గా ట్వీట్ చేయగా.. మెగాస్టార్ ఒక స్పెషల్ మెమొరీని షేర్ చేసుకున్నారు.

Recommended Video

Legendary NTR Jayanthi : Jr NTR, Megastar Chiranjeevi Pays Tribute To NTR On His Birth Aniversary
 ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

తన తాత ఎన్టీఆర్ ని జూనియర్ చాలా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత. అని భావొద్వేగ సందేశం పోస్ట్ చేసారు.

 మెగాస్టార్ స్పెషల్ ఫోటో

మెగాస్టార్ స్పెషల్ ఫోటో

ఇక మరోవైపు మెగాస్టార్ కూడా ఎన్టీఆర్ తో ఒకప్పుడు దిగిన స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ విధంగా ట్వీట్ చేశారు. తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం..., తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం... నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.... వారితో కలిసి నటించడం నా అదృష్టం...పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ... ‘ అని ట్వీట్ చేశారు.

 బాలయ్య నివాళి..

బాలయ్య నివాళి..

బాలకృష్ణ ఎప్పటిలానే తన తండ్రికి ఎన్టీఆర్ ఘాట్ కి ఉదయాన్నే చేరుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి సంధర్భంగా బాలకృష్ణ ఘాట్ వద్ద కాసేపు మౌనం పాటించారు. తండ్రి సమాధిపై పుష్పాలు ఉంచి భార్య వసుంధర దేవితో నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు మరికొంత మంది ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులర్పించారు.

 ఇంటి నుంచే..

ఇంటి నుంచే..

అసలైతే ప్రతి ఏడాది నందమూరి ఫ్యామిలీలోని ప్రతి కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ ఇంటి నుంచే తాత గారికి నివాళులు అర్పించారు. ఈ విషయం గురించి ఒక రోజు ముందే ఈ బ్రదర్స్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X