కల్యాణ్ రామ్‌తో దిల్ రాజు సినిమా: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో మరోసారి జోడీ

కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన చిత్రాల మీద ఫోకస్ చేసిన అతడు.. సత్ఫలితాలను రాబడుతున్నప్పటికీ బ్రేక్‌ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ముందుకు వెళ్తున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పట్టాలెక్కస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రకటించిన ఈ నందమూరి హీరో.. తాజాగా మరో ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.

ఈరోజు (జూలై 5) నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని అతడు నటించబోయే 20వ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాణ సంస్థ 'నందమూరి కల్యాణ్ రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అతడితో సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది. కేవీ గుహన్.. కల్యాణ్ రామ్ హిట్ కాంబోనే మళ్లీ తీసుకొస్తున్నాము. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాము' అంటూ ట్వీట్ చేసింది.

Nandamuri Kalyan Ram and Dil Raju Movie Announced

ఇక, ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతోంది. అందులో 'క్రైమ్ సీన్.. డూ నాట్ ఎంటర్' అని పోలీసులు ఏర్పాటు చేసినట్లు చూపించారు. దీంతో అప్పుడే సినిమాపై ఆసక్తిని పెంచేశారు. గతంలో గుహన్.. కల్యాణ్ రామ్ కాంబోలో '118' అనే ప్రయోగత్మక చిత్రం వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ నందమూరి హీరో 'బింబిసారా'తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ఒకటి, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరో సినిమాను చేస్తున్నాడు. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X