twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara: బింబిసారా దండయాత్ర అప్పటి నుంచే.. స్టైలిష్ లుక్‌లో కల్యాణ్ రామ్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అవడమే. అయితే, అందులో అందరూ సక్సెస్ కాలేదు. కొందరు మాత్రమే తమ సత్తాను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కల్యాణ్ రామ్ ఒకడు. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ విజయాలను మాత్రమే అందుకున్న అతడు.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన చిత్రాల మీద ఫోకస్ చేసిన ఈ నందమూరి హీరో.. సత్ఫలితాలను రాబడుతున్నా హిట్లను మాత్రం దక్కించుకోవట్లేదు.

    Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

    ప్రతికూల ఫలితాలు వస్తున్నప్పటికీ నందమూరి కల్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'బింబిసారా' అనే సినిమాను చేస్తున్నాడు. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో సినిమా ఆలస్యం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే టాకీ పార్టును చాలా వరకూ పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు.

    వాస్తవానికి కల్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నా.. అతడికి కావాల్సిన బ్రేక్ మాత్రం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'బింబిసారా' వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో రాజుల కాలం నాటి కథతో రాబోతున్న ఈ మూవీపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. కాసేపట్లోనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూపించారు. మరీ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోవడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడిపోయాయి.

    Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!

    Nandamuri Kalyan Ram Bimbisara Release on August 5th

    క్రేజీ సబ్జెక్టుతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'బింబిసారా' మూవీని గత ఏడాది సమ్మర్‌లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, అప్పటికి షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో గత డిసెంబర్‌లోనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అది కూడా సాధ్య పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఇక, దీన్ని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. ఇందులో కల్యాణ్ రామ్ బ్లేజర్ వేసుకుని కోరమీసంతో స్టైలిష్‌గా దర్శనం ఇస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది.

    మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బింబిసారా' మూవీ టైమ్ మెషీన్ ఆధారంగా నడిచేదిగా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీనికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

    English summary
    Nandamuri Kalyan Ram Now Doing Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Will Release on August 5th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X