twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara: కల్యాణ్ రామ్ నుంచి అదిరిపోయే కానుక.. డేట్ ప్రకటించిన నందమూరి హీరో

    |

    టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనే కాదు.. ఆయన తర్వాత వారసులుగా పలువురు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. వీళ్ల తర్వాత ఓ రేంజ్‌ను అందుకున్న హీరో మాత్రం నందమూరి కల్యాణ్ రామే. ఇక, ఈ హీరో చాలా కాలంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, విజయాలు మాత్రం అంతగా దక్కడం లేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.

    బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

    కెరీర్ ఆరంభం నుంచీ కమర్షియల్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చాడు నందమూరి కల్యాణ్ రామ్. అయితే, 'పటాస్' తర్వాత అతడి పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను చేశాడు. వీటిలో చాలా వరకూ ప్రేక్షకుల స్పందనను అందుకున్నాయి. దీంతో ఇదే విధంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే కొత్త దర్శకులతో కొత్త కాన్సెప్టులను చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'బింబిసారా' అనే చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

    Nandamuri Kalyan Ram Bimbisara Teaser on November 29th

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'బింబిసారా' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా ఇది ఇప్పటికే దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలిసింది. చారిత్రక నేపథ్యంతో సాగే ఈ సినిమా నుంచి ఆ మధ్య టైటిల్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. దీంతో ఏదైనా అప్‌డేట్ కావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే ప్రకటన వెలువడింది. అదే.. 'బింబిసారా' మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్.

    Akhanda ఈవెంట్‌కు బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్: ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టేAkhanda ఈవెంట్‌కు బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్: ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టే

    భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'బింబిసారా' మూవీ నుంచి టీజర్‌ను వదలబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నట్లు తాజాగా ఓ చిన్న వీడియోను వదిలారు. అంతేకాదు, 'అతడు క్రూరమైన వాడు.. కిరాతకమైన వాడు.. తన బార్బేరియన్ సామ్రాజ్యాన్ని గుర్తు చేసేందుకు వస్తున్నాడు' అంటూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వెల్లడించారు. ఇక, ఈ మూవీ టీజర్ దాదాపు నిమిషం పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

    మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'బింబిసారా' టైమ్ మెషీన్ ఆధారంగా నడిచే చిత్రమని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో హీరో టైమ్ మెషీన్ ఎక్కి ఐదు వందల సంవత్సరాలు వెనుకకు, ఐదు వందల సంవత్సరాలు భవిష్యత్‌లోకి వెళ్తాడట. ఆ సమయంలో బిబిసారా కథను చూపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీనికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    English summary
    Nandamuri Kalyan Ram Now Doing Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Teaser Will Relase on November 29th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X