Bimbisara Teaser: బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం.. నెత్తుటి సంతకం పెట్టిన కల్యాణ్ రామ్

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే మంచి పేరును సంపాదించుకున్న హీరోల్లో కల్యాణ్ రామ్ ఒకడు. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ విజయాలను మాత్రమే అందుకున్న అతడు.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన చిత్రాల మీద ఫోకస్ చేసిన ఈ నందమూరి హీరో.. సత్ఫలితాలను రాబడుతున్నా హిట్లను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ముందుకు వెళ్తున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు.

ప్రస్తుతం నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న చిత్రాల్లో 'బింబిసారా' ఒకటి. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా ఇది ఇప్పటికే దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలిసింది. చారిత్రక నేపథ్యంతో సాగే ఈ సినిమా నుంచి ఆ మధ్య టైటిల్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. దీంతో ఏదైనా అప్‌డేట్ కావాలని నందమూరి అభిమానులు చాలా రోజులుగా కోరుకుంటున్నారు.

Nandamuri Kalyan Ram Bimbisara Teaser Released

ఇలాంటి పరిస్థితుల్లో 'బింబిసారా' టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈరోజు ఉదయం దీన్ని వదిలారు. ఈ టీజర్‌ ఆరంభం నుంచే ఓ గంభీరమైన స్వరంతో 'ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలు అయితే.. ఇందరి భయాలను చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం' అంటూ హీరో పాత్రకు సంబంధించిన ఎలివేషన్‌ను చక్కగా ఇచ్చారు.

ఇక, ఈ టీజర్ విజువల్ వండర్‌గా ఉంది. మరీ ముఖ్యంగా బింబిసారుడి సామ్రాజ్యపు కోట.. సభాస్థలి ఎంతో హై రేంజ్‌లో కనిపిస్తున్నాయి. అలాగే, ఇందులో యాక్షన్ సీక్వెన్స్ కూడా చక్కగా వచ్చినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ టీజర్ చివర్లో మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కల్యాణ్ రామ్ కూడా కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో అతడు రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లు అర్థం అవుతోంది. మొత్తానికి ఈ టీజర్ నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ టీజర్ తక్కువ సమయంలోనే మంచి స్పందనను కూడా అందుకుంటోంది.

మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'బింబిసారా' టైమ్ మెషీన్ ఆధారంగా నడిచే చిత్రమని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీనికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X