Devil: నందమూరి ఫ్యాన్స్‌కు పండగే.. కల్యాణ్ రామ్ మిస్టరీ మూవీ వచ్చేది ఆరోజే
టాలీవుడ్‌లోకి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ, అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే బడా స్టార్లుగా ఎదిగారు. మిగిలిన వాళ్లలో మంచి పేరు తెచ్చుకుంది మాత్రం నందమూరి కల్యాణ్ రామే అని చెప్పాలి. చాలా కాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. కొన్ని హిట్లను మాత్రమే అందుకున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'బింబిసార'తో హిట్ కొట్టాడు. అయితే, ఇటీవలే 'అమిగోస్'తో ఫ్లాపును చవి చూశాడు.
ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' అనే సినిమాను చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ఉప శీర్షికతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా టాకీ పార్టును చాలా వరకూ పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని త్వరలోనే కంప్లీట్ చేసేలా ప్లాన్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది.

పిరియాడిక్ జోనర్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతున్న 'డెవిల్' మూవీని ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఎన్నో తేదీలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నవంబర్ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో డేట్‌ను హైలైట్ చేసి కల్యాణ్ రామ్ పోస్టర్‌ను మాత్రం బ్యాగ్రౌండ్‌లో ఉంచారు. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్‌కు ఇది పండుగ లాంటి వార్తే అని చెప్పాలి.

క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'డెవిల్' మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అజయ్, సత్య తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











