విజయ దశమికి నందమూరి హీరో స్పెషల్.. ఎంత మంచివాడవురా!

విజయ దశమి కానుకగా నందమూరి అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు యంగ్ హీరో కళ్యాణ్ రామ్. ఆయన తాజా సినిమా ఎంత మంచివాడవురా! కి సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ పెట్టాడు.

ఉమేష్ గుప్త సమర్పణలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఎంత మంచివాడవురా! మూవీ. చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 17వ సినిమా. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం బాణీలు కడుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఎంత మంచివాడవురా! సినిమా టైటిల్ పోస్టర్, వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు విజయదశమి కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Nandamuri Kalyan Ram Entha Manchivaadavuraa Update

అక్టోబర్ 9వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఎంత మంచివాడవురా! ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తున్నామని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్టర్ లో కళ్యాణ్ రామ్ సూపర్బ్ లుక్ లో కనిపిస్తుండటం నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ లుక్ చూసి దసరా స్పెషల్ ట్రీట్ ఖచ్చితంగా అదిరిపోయేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

ప్రస్తుతం 'ఎంతమంచి వాడవురా' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు యూనిట్ సభ్యులు. మరోవైపు అదే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ కూడా తన కొత్త సినిమాతో రెడీ అవుతున్నారు. అంటే వచ్చే సంక్రాంతికి థియేటర్స్ అన్నీ నందమూరి అభిమానుల ఈలలు గోలలతో హోరెత్తి పోనున్నాయన్నమాట. చూడాలి మరి ఈ సంక్రాంతి బరిలో నందమూరి హీరోలు ఎంతమేర ప్రతాపం చూపెడుతారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X