ఆ రోజు వరకు హ్యాపీ... ఆ తర్వాత ఏమైంది? ఉత్కంఠ రేపుతున్న ‘118’
Recommended Video

నందమూరి కళ్యాణ్, నివేథా థామస్, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం '118'. సినిమాటోగ్రాఫర్‌గా సినీ ప్రేమికులకు సుపరిచితం అయిన కె.వి.గుహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 'నా నువ్వే' అనే చిత్రాన్ని నిర్మించిన మహేష్ కోనేరు 'ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్' బేనర్లో నిర్మించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా '118' టీజర్ విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది.

ఆ తర్వాత ఏమైంది?
కలర్‌ఫుల్ హ్యాపీ మూడ్‌తో 118 టీజర్ మొదలైంది. కళ్యాణ్ రామ్, శాలిని పాండే మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు స్టైలిష్‌గా, రిచ్ లుక్‌తో ఉన్నాయి. ఆ రోజు వరకు... హ్యాపీగా ఉన్న వారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
అదిరిపోయే టేకింగ్
బ్యూటీఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకులు కె.వి.గుహన్... దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. టీజర్లోనే టేకింగ్ అదిరిపోయే విధంగా ఉంటుందనే భావన కలగడజేయడంలో సక్సెస్ అయ్యాడు.

సంక్రాంతి తర్వాత
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 2019లో అంటే... సంక్రాంతి తర్వాత విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు.

తెర వెనక
నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: మిర్చి కిరణ్, పి.ఆర్ అండ్ మార్కెటింగ్: వంశీ కాక, ఆర్ట్: కిరణ్ కుమార్.ఎం, ఎడిటర్: తమ్మిరాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: వెంకట్, అన్బరివు, రియల్ సతీశ్, వి.ఎఫ్.ఎక్స్: అద్వైత క్రియేటివ్ వర్క్స్, అనిల్ పడూరి, నిర్మాత: మహేష్ కొనేరు, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి.గుహన్.


Click it and Unblock the Notifications











