500 మంది ఫైటర్స్‌తో డెవిల్.. టాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచేలా కల్యాణ్ రామ్ యాక్షన్ ఎపిసోడ్!
టాలీవుడ్‌లో ప్రయోగాలకు పెట్టింది పేరు కల్యాణ్ రామ్. తన కెరీర్ ఆరంభం నుంచి కొత్త దర్శకులను ప్రోత్సాహిస్తూ.. విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకొన్నారు. తాజాగా బింబిసార, అమిగోస్ లాంటి వైవిధ్యమైన సినిమాలతో అలరించారు. మరోసారి విభిన్నమైన కంటెంట్‌తో కల్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం డెవిల్ (Devil - British Secret Agent). బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్.
నిర్మాత అభిషేక్ నామా తన సొంత బ్యానర్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాన్ష్ నామా సమర్పణలో ఈ సినిమాను నూతన దర్శకుడు నవీన్ మేడారం పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకొన్నది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను 500 మందితో ఈ ఫైటర్స్‌తో చిత్రీకరిస్తుండటం విశేషంగా మారింది. టాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే యాక్షన్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో డిజైన్ చేశారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే తపన ఉన్న మా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరో డిఫరెంట్ అవతార్‌లో ఆకట్టుకోబోతున్నారు. సినిమా అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. 500 మంది ఫైటర్స్‌తో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను వెంకట్‌గారు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. దీన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్పగా పిక్చరైజేషన్ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలియజేస్తాం అని అన్నారు.
సౌందర్ రాజన్.ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ... శ్రీకాంత్ విస్సా కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు అని తెలిపారు.
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: నవీన్ మేడారం
సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్.ఎస్
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్ : హర్షవర్ధన్ రామేశ్వర్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: తమ్మిరాజు
కో డైరెక్టర్: చలసాని రామారావు
స్టోరి డెవలప్‌మెంట్: ప్రశాంత్ బరది
సీఈవో: పోతిని వాసు
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
పీఆర్వో: వంశీ కాకా, వంశీ శేఖర్


Click it and Unblock the Notifications











