నందమూరి హీరో సర్‌ప్రైజ్.. ఎంత మంచివాడవురా!

హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా రాణిస్తూ వస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవలే 118 అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీతో అలరించిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఎంత మంచివాడవురా! అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు (జులై 5) నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఎంత మంచివాడవురా! అనే టైటిల్ పోస్టర్, వీడియో విడుదల చేశారు.

విభిన్న కతాంశాలను ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ డిఫెరెంట్ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఎంత మంచివాడవురా! అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఉమేష్ గుప్త సమర్పిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇది 17 వ సినిమా. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రానికి గోపిసుందర్ సంగీతం బాణీలు కడుతున్నారు.

Nandamuri Kalyan Rams Entha Manchivaadavuraa

ఎంత మంచివాడవురా! అనే సాఫ్ట్ టైటిల్‌తో పాటు టైటిల్‌ లోగో వీడియో కూడా విడుదల చేసిన చిత్రయూనిట్.. ఈ వీడియోలో క‌ళ్యాణ్ రామ్ లుక్‌ని రివీల్ చేయకుండా వెనుక నుంచే చూపించడం గమనార్హం. ఎంత మంచివాడవురా! అనే పాట రేడియో వినిపిస్తుండగా, కళ్యాణ్ రామ్ సైకిల్ పై వెళుతున్న సన్నివేశంతో టైటిల్ లోగో వీడియో విడుదలైంది. టైటిల్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎంతో సాఫ్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. గత చిత్రాల పరంగా చూస్తే ఇటు కళ్యాణ్ రామ్‌కి, అటు సతీష్ వేగేశ్నకు ఈ సినిమా ఎంతో ఇంపార్టెంట్ మూవీ. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. 'రావణ' మరో సినిమాకు కమిటయ్యారు కళ్యాణ్ రామ్. ఏక కాలంలో ఈ రెండు చిత్రాల షూటింగ్ లో పాల్గొననున్నారట కళ్యాణ్ రామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X