నందమూరి హీరో సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్.. హీరోయిన్ ఎవరంటే

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చేసింది. ఈ ఏడాది '118' అనే డిఫెరెంట్ థిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ మరో కొత్త సినిమాను పట్టాలెక్కించ బోతున్నాడు. 'శతమానం భవతి' ఫేం సతీష్ వేగ్నేశతో తన తదుపరి సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారు కళ్యాణ్ రామ్. ఆయన కెరీర్ లో 17వ సినిమా ఈ సినిమా రాబోతోంది.

ఇక ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, ఆదిత్య మ్యూజిక్ వ్యవస్థాపకులు ఉమేష్ గుప్తా నిర్మాతగా బాధ్యతలు చేపట్టనున్నారు. కళ్యాణ్ రామ్ తో సరసాలాడేందుకు హీరోయిన్ గా మెహ్రీన్ ని ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

 Nandamuri Kalyan Rams new movie official Statement

గత చిత్రాల పరంగా చూస్తే ఇటు కళ్యాణ్ రామ్ కి, అటు సతీష్ వేగ్నేశ కు ఈ సినిమా ఎంతో ఇంపార్టెంట్. ఇది దృష్టిలో పెట్టుకునే ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తూ గుండెల్ని పిండేసే సన్నివేశాలు ఉండేలా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట సతీష్ వేగ్నేశ. ఇప్పటిదాకా యాక్షన్ రోల్స్ లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా ద్వారా సరికొత్త జానర్ లోకి వచ్చేస్తున్నాడని అర్థమవుతోంది. సాధారణంగా సతీష్ వేగ్నేశ సినిమాలలో మాస్ మాసాలాలు లేకపోయినా కూడా ఫ్యామిలీ మొత్తాన్ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ కు లోటు ఉండదని మనకు తెలుసు. సో ఈ సినిమా ద్వారా కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కోణాన్ని చూడొచ్చన్నమాట నందమూరి అభిమాన వర్గం. ఓ వైపు నిర్మాతగా కొనసాగుతూనే మరో వైపు హీరోగా కూడా తన ప్రత్యేకత చాటుకుంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X