twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదట ఫెయిల్ ఆపై పాస్ చివరగా సెకండ్ క్లాస్.. రివ్యూలపై నందమూరి కళ్యాణ్ రామ్ కామెంట్స్

    |

    శతమానంభవతి లాంటి జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. అయితే ద్వితీయ ప్రయత్నంగా చేసిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆదరణకు నోచుకోకపోయినా.. మంచి ప్రయత్నమంటూ ప్రశంసలు లభించాయి. మళ్లీ అదే కోవలో ఎంత మంచివాడవురా వంటి చిత్రాన్ని మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడంతో యూనిట్ అంతా కలిసి థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.

    రాత్రంతా నిద్ర పట్టలేదు..

    రాత్రంతా నిద్ర పట్టలేదు..

    ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రం మీముందు రావడానికి కారణం నిర్మాతలైన ఉమేష్ గుప్త, సుభాస్ గుప్తలే కారణమని అన్నాడు. అందుకు వారికి థ్యాంక్స్‌ చెప్పాడు. మొదటి నుంచి తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ.. కథ విన్నప్పటి నుంచి తనను నమ్మి డేట్స్ ఇచ్చిన హీరోకు థ్యాంక్స్ తెలిపాడు. ఎగ్జామ్స్ రాశాక రిజల్ట్స్ కోసం ఎదురుచూసినట్టు ఉందని, రాత్రంతా నిద్ర పట్టలేదని అన్నాడు.

    డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆ మాట..

    డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆ మాట..

    మొదటి ఆట అయ్యాక ఫెయిల్ అని అన్నారు.. ఆ కాసేపటికి పాస్ అన్నారు.. సాయంత్రానికి సెకండ క్లాస్ అన్నారని చెప్పుకొచ్చాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారని, గొప్ప సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిందని అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ఫ్యామిలీ కోసం తీశామని, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయని అన్నాడు. తన పేరు మీద ఎవరో నకిలీ ఖాతా సృష్టించి ఫేక్ కలెక్షన్లను ప్రచారం చేస్తున్నారని అవేవీ నిజం కావనీ, ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ షేర్, బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిందని పేర్కొన్నాడు.

    గుర్తుండిపోయే సినిమాలు..

    గుర్తుండిపోయే సినిమాలు..

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నిర్మాతలకు ఒంట్లో బాగా లేకపోవడంతోనే ఈ ఈవెంట్‌కు రాలేకపోయారని అన్నాడు. ఈ చిత్రం అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని తెలిపాడు. గుర్తుండి పోయే సినిమాలు చేయాలనేదే తన కోరిక అని పేర్కొన్నాడు. మొదటి ఆటకు బాగా లేదని అన్నా.. మ్యాట్నీ వరకు బాగుందని రిపోర్ట్ వచ్చిందని తెలిపాడు. ఈ సినిమా తన ఫ్యామిలీ చూసిందని, తన క్యారెక్టర్, తన నటన, అప్పియరెన్స్ బాగుందని కితాబిచ్చారని అన్నాడు.

    ప్రతీ ఒక్కరిలో మంచి..

    ప్రతీ ఒక్కరిలో మంచి..

    ప్రతీ ఒక్కరూ మంచి వారేనని, అందరిలో పాజిటివ్ చూడాలని తెలిపాడు. నెగెటివ్ ఆలోచనలు దూరంగా పెట్టాలని, తమ సినిమా గురించి కూడా నెగెటివ్ రాసేవారుంటారని అయితే తాము వాటిని ఎలా తీసుకుంటామని దానిపై ఆధారపడి ఉంటుందని అన్నాడు. ఎలా అయినా రాసే హక్కు ఉంటుంది..కానీ పాజిటివ్‌గా ఆలోచించడం, పాజిటివ్‌ గురించి రాయడం చేయాలని సలహా ఇచ్చాడు.

    మంచి సినిమా చూశామని..

    మంచి సినిమా చూశామని..

    తనకు ఈ చిత్రంలో తనికెళ్ల భరణితో చేసిన సీన్ బాగా ఇష్టమని, నాన్నకొట్టాడని, తిట్టాడని ఇంట్లోంచి వెళ్లిపోతామా?అనే డైలాగ్ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఏమో ఏమో ఏ గుండెల్లో తనకు చాలా ఇష్టమైనపాట అని అలాంటి సాంగ్ ఇచ్చినందుకు గోపీ సుందర్‌కు థ్యాంక్స్ తెలిపాడు. మెహరీన్ చాలా బాగా నటించిందని అన్నాడు. నరేష్, రాజీవ్ కనకాల బాగా చేశారని చెబుతూ.. ఫ్యామిలీతో కలిసి చూడండని, ఓ మంచి చిత్రం చూశామని అనిపిస్తుందని ముగించాడు.

    English summary
    Entha Manchivaadavuraa Thanks Meet Held On Thurs Day. Nandamuri Kalyan Ram And Satish Vegesna Are Spoken About Movie Result.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X