Devil: నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. డెవిల్ డేట్ వచ్చేసిందిగా!
నందమూరి ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా ఎదగగా.. ఒక్క హీరో మాత్రం ఆ రేంజ్‌కు చేరేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు నందమూరి కల్యాణ్ రామ్. చాలా కాలం క్రితమే హీరోగా వచ్చిన అతడు.. కెరీర్‌ను మాత్రం ఆశించిన రీతిలో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లోనే కల్యాణ్ రామ్ గత ఏడాది 'బింబిసార'తో హిట్ కొట్టాడు. అయితే, ఈ ఏడాది 'అమిగోస్' అనే సినిమాను చేశాడు. కానీ, ఇది డిజాస్టర్‌గానే మిగిలిపోయింది.
ఈ సారి ఎలాగైనా బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' అనే సినిమాను చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ఉప శీర్షికతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా టాకీ పార్టును చాలా వరకూ పూర్తి చేసుకుని నవంబర్ 24న దీన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పిరియాడిక్ జోనర్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతున్న 'డెవిల్' మూవీని ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఎన్నో తేదీలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసేసింది. ఇందులో కల్యాణ్ రామ్ ఐదు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించాడు. పైన డేట్‌ను ఉంచారు. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్‌కు ఇది పండుగ లాంటి వార్తే అని చెప్పాలి.

డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'డెవిల్' మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అజయ్, సత్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











