నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. కొత్త సినిమా నుంచి క్రేజీ వీడియో రిలీజ్
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. అన్ని విభాగాల్లోనూ మెప్పిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు కల్యాణ్ రామ్. ఫలితాలను అస్సలు పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్న అతడు.. 'బింబిసార' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా ఈ మధ్య పలు చిత్రాలతో వచ్చినా సరైన హిట్‌ను మాత్రం అందుకోలేదు.
మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తోన్న నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని గ్రాండ్‌గా తీస్తున్నారు.

డిఫరెంట్ మాస్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అప్పటి నుంచి పలు షెడ్యూళ్లను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుని త్వరలోనే దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ - ప్రదీప్ చిలుకూరు కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా Fist Of Flame పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వదిలిన ఇందులో హీరోను కనిపించీ కనిపించకుండా చూపించారు. మొదట నీట్‌గా ఉన్న చేయి.. తర్వాత పిడికిలిగా మారి రక్తంతో తడవడాన్ని హైలైట్ చేశారు.
నందమూరి కల్యాణ్ రామ్ కొత్త సినిమా నుంచి తాజాగా విడుదలైన వీడియోలో విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా ఇందులో కల్యాణ్ రామ్ లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మొత్తంగా NKR21 Fist Of Flame వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది. దీంతో ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతోంది.
ఇదిలా ఉండగా.. కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలసు నిర్మిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో విజయశాంతి, సోహెల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











