Devil Postponed: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. డెవిల్ మూవీ వాయిదా.. రీజన్ తెలిస్తే!
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. కష్టపడేతత్వంతో మంచి పేరును, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు ప్రముఖ హీరో కల్యాణ్ రామ్. ఇలా దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా టాలీవుడ్‌లో సత్తా చాటుతోన్నాడు. అయితే, ఫలితాల విషయంలో మాత్రం నిరాశనే ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితుల్లోనే 'బింబిసార'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న అతడు.. ఈ ఏడాది వచ్చిన 'అమిగోస్' మూవీతో భారీ ఎదురుదెబ్బనే తగిలించుకున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నాడు.
మరో భారీ విజయం కోసం ఎదురు చూస్తోన్న నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' అనే సినిమాను చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ఉప శీర్షికతో ఇది రాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా టాకీ పార్టును దాదాపుగా పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం శరవేగంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.

పిరియాడిక్ జోనర్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతున్న 'డెవిల్' మూవీని నవంబర్ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతుండగా.. ఫ్యాన్స్ అంతా ఈ చిత్రం కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
'డెవిల్' మూవీ వాయిదాపై తాజాగా నిర్మాతలు ఓ ప్రకటన వదిలారు. అందులో 'మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'డెవిల్' మూవీ విడుదల నవంబర్ 24 నుంచి వాయిదా పడింది. బ్యాగ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాము' అని చెప్పుకొచ్చారు.
క్రేజీ కాన్సెప్టుతో హై రేంజ్‌లో రాబోతున్న 'డెవిల్' మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అజయ్, సత్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











