118 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కల్యాణ్ రామ్, షాలిని పాండే కెమిస్ట్రీపై..!
నందమూరి హీరో కల్యాణ్ రామ్ కెరీర్ కూల్‌గా సాగిపోతున్నది. ఓ వైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు రూపొందిస్తు ముందుకెళ్తున్నాడు. గతేడాది ఎమ్మెల్యేతో సక్సెస్ సొంతం చేసుకోగా, నా నువ్వే సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ చిత్రాల తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం 118 మూవీ. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే కాంబినేషన్‌లో వస్తున్న 118 చిత్ర రిలీజ్ డేట్‌ను యూనిట్ ఖారారు చేసింది. ఈ చిత్రాన్ని మార్చి 1 తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

118 చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ కనిపించింది. టీజర్‌లో కల్యాణ్ రామ్, షాలిని పాండే మధ్య కెమిస్ట్రీ ఆసక్తిని రేకెత్తించింది. థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











