HBD Mokshagna: నందమూరి ‘సింబా’ వచ్చేశాడు.. ఊహించని లుక్‌లో మోక్షజ్ఞ

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అందులో చాలా మంది బడా రేంజ్‌కు ఎదిగారు. దీంతో మరికొందరు పెద్ద పెద్ద స్టార్లు కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఈ సీనియర్ హీరో తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా సత్తా చాటుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా హీరోగా రాబోతున్నాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో అతడి రాక కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తితో వేచి చూస్తున్నారు.

Nandamuri Mokshagna First Look Released From Prasanth Varma Movie

కొన్నేళ్ల క్రితమే నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందులో అతడు చాలా లావుగా ఉండడంతో ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. కానీ, ఇప్పుడు మాత్రం వాడి లుక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా అతడు బాగా సన్నబడడంతో పాటు హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మోక్షజ్ఞను హీరోగా తీసుకు వచ్చే బాధ్యతను బాలయ్య.. రాజమౌళి చేతిలో పెట్టాడని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, క్రిష్ సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మను ఇటీవలే ఫైనల్ చేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన న్యూస్ కూడా లీక్ అయింది.

ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన తాజాగా వచ్చేసింది. ఈరోజు అతడి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రశాంత్ వర్మతో చేయబోయే ప్రాజెక్టును ప్రకటించారు. అంతేకాదు, నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో చిన్న లయన్ ఎంతో స్లిమ్‌గా హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశాడు.

ఇదిలా ఉండగా.. నందమూరి మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీని వినోదాత్మక కథనంతో పురాణాలను టచ్ చేస్తూ దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X