నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డేట్ ఫిక్స్.. ప్రశాంత్ వర్మ మూవీ ఎప్పుడంటే? ఇంట్రడక్షన్ షాట్ అదిరిపోయేలా అంటూ..
తెలుగు సినిమాకు లెజెండరీ ఫ్యామిలీ నుంచి మరో స్టార్ రాబోతున్నాడు. ఎంతో కాలంగా నందమూరి అభిమానులు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నందమూరి నటవంశం నుంచి బాక్సాఫీస్ నుంచి హడలెత్తించడానికి రంగం సిద్దమైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అప్ డేట్స్ సంచలనం రేపుతున్నాయి. నందమూరు మోక్షజ్జ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వైరల్ అప్‌డేట్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమకు 2024 సంవత్సరం ప్రత్యేకంగా కాబోతున్నది. ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం కాబోతున్నదా? అనేంతగా ఆ వంశం నుంచి సినిమాలు రాబోతున్నాయి. మోక్షజ్ఞ సినిమా వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నది. అయితే ఆ సినిమాను 2024లో రిలీజ్ చేస్తారా? లేదా 2025 సంక్రాంతికి తీసుకొస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు కానీ.. మోక్షజ్ఞ తేజ ఎంట్రీ మాత్రం అదిరిపోయేలా ఉండబోతున్నదనే విషయం స్పష్టమైంది.

హానుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ కెరీర్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం తమన్ అందిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇంకా సాంకేతిక నిపుణులు, నటీనటులు పేర్లు ఇంకా ఖరారు కాలేదనేది తాజా సమాచారం.
అయితే మోక్షజ్ఞ తేజ అకౌంట్ నుంచి ఈ సినిమా గురించి సెన్సేషన్ ట్వీట్ పడింది. మా సినిమాలో నా ఇంట్రడక్షన్ షాట్ మతిపోయేలా ఉండటమే కాకుండా థియేటర్‌లో ఫైర్ పెడుతుంది. స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్ .. ఊహలకు అందని విధంగా ఉంటాయి. ప్రశాంత్ వర్మ రాసిన స్క్రిప్టు ఓ రేంజ్‌లో ఉంది అని ట్వీట్ చేశారు.
ఇక ప్రశాంత్ వర్మ, నేను నటించే సినిమా సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం కాబోతున్నది. తేదీని మీరే కాకుండా చరిత్ర కూడా గుర్తు పెట్టుకొంటుంది. మోక్షజ్ఞ తేజ, ప్రశాత్ వర్మ అదే రోజు ప్రారంభం కాబోతున్నది అని తెలిపారు. దాంతో నందమూరి అభిమానుల్లో ఆనందం రెండింతలయ్యింది.


Click it and Unblock the Notifications











