బాలకృష్ణ వారసుడి లేటెస్ట్ లుక్ వైరల్.. టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే?
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం.. మోక్షజ్ఞ ఎప్పుడు వెండితెరపై కనిపిస్తాడా అని. చాలా కాలంగా ఆ వారసుడి ఎంట్రీపై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ కూడా చాలా సందర్భాల్లో తనయుడి ఎంట్రీపై పాజిటివ్ గానే స్పందించాడు. కానీ ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ సస్పెన్స్ వీడలేదు. కనీసం ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అని విషయంల్ కూడా అప్డేట్ లేదు. మళ్ళీ ఇప్పుడు మరొక కొత్త రూమర్ వినిపిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత మోక్షజ్ఞ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే పాతికేళ్ల వయసు
గతంలోనే చాలా సార్లు మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. పాతికేళ్లు దాటినా కూడా హీరోగా ఇంకా రెడీ అవ్వలేదని మోక్షజ్ఞ ఫిట్నెస్ చూస్తేనే అర్థమవుతోందని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ మధ్య బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫొటోలతో మోక్షజ్ఞ కనిపించగానే సోషల్ మీడియాలో ఆ లూక్ చాలానే వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్ మనవడి పెళ్లిలో..
ఇక చాలా రోజుల తరువాత మోక్షజ్ఞకు సంబంధించిన మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల నందమూరి వారిలో ఇంట్లో ఒక పెళ్లి వేడుక జరిగింది. ఎన్టీఆర్ పెద్దకుమారుడు నందమూరి జయకృష్ణ కుమారుడు కృష్ణ చైతన్య వివాహం ఇటీవల చాలా కూల్ గా జరిగింది. ఎలాంటి హడావుడి లేకుండా కానిచ్చేశారు. అయితే అందులో ఎక్కుబాగా బాలయ్య ఫ్యామిలీ హడావుడి చేసింది.

మొదటి సినిమా వచ్చే వరకు.. దూరంగానే..
ఇక పెళ్లి వేడుకలో బాలకృష్ణ ముద్దుల కుమారుడు మోక్షజ్ఞ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞ ఎక్కువగా ప్రైవసిని ఇష్టపడతాడాని అందరికి తెలిసిన విషయమే. బాలకృష్ణ కూడా మొదటి సినిమా తెరపైకి వచ్చే వరకు కూడా మోక్షజ్ఞను మీడియా కంట పడకుండా ఉంచాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే?
అయితే ఏదైనా ఈవెంట్స్ అయితే మాత్రం అనుకోకుండా మోక్షజ్ఞ ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఇక అతని మొదటి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య ఇప్పటికే కొన్ని కథలు రెడీ చేయించిన్నట్లు తెలుస్తోంది. రైటర్ సాయి మాధవ్ బుర్ర కూడా మోక్షజ్ఞ కోసం పవర్ఫుల్ స్టోరీ చేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో మోక్షజ్ఞ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని టాక్. మరి ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. రానున్న


Click it and Unblock the Notifications











