Taraka Ratna: తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. విషమంగా పరిస్థితి!

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. ఇప్పుడు రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని భావిస్తోన్నారు హీరో తారకరత్న. ఆ వైపుగా ఈ మధ్యే అడుగులు వేస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి తారకరత్న ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. తాజాగా తారక రత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

ఆరోగ్యం విషయంపై ఎప్పటికప్పుడు..

ఆరోగ్యం విషయంపై ఎప్పటికప్పుడు..

నందమూరి తారకరత్న హఠాత్తుగా కార్డియక్ అరెస్ట్ కావడంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే ప్రస్తుతం తారకరత్నకు పూర్తిస్థాయిలో వైద్యులు వైద్యం అందిస్తూ ఆయనని మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్య విషయం గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు అడిగి తెలుసుకుంటున్నారు.

 యువగళం పాదయాత్రలో..

యువగళం పాదయాత్రలో..

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో హీరో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడి నుంచి పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

బెంగళూరులోని ఆస్పత్రికి..

బెంగళూరులోని ఆస్పత్రికి..

నందమూరి తారకరత్న గుండెలోని ఎడమ వైపు కవాటం 90 శాతం వరకూ బ్లాక్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కానీ, బీపీ మాత్రం బాగానే ఉందని వెల్లడించారు. మొత్తానికి నందమూరి తారకరత్నకు ప్రాణాపాయం తప్పినట్లు శుక్రవారం వైద్యులు చెప్పినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి చీఫ్‌ను వైద్యులు సంప్రదించారు.

 హెల్త్ బులిటెన్ విడుదల..

హెల్త్ బులిటెన్ విడుదల..

బెంగళూరు నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం రప్పించారు. అలాగే, అందులో పలువురు కార్డియాలజిస్టులను కూడా రావాలని కోరారు. అందుకు తగ్గట్లుగానే వాళ్లు రావడంతో తారకరత్నకు చికిత్స చేయించారు. ఈ క్రమంలో తాజాగా తారకరత్న ఆరోగ్యంపై నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ జారీ చేశారు.

విషమంగా పరిస్థితి..

హీరో తారకరత్న పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు ప్రత్యేక బృందం పర్వవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. "కార్డియాలజిస్ట్ లు, ఇంటెసివిస్ట్ లు, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నాం" అని ఆస్పత్రి వర్గాల నుంచి వచ్చిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X