Health Bulletin: ఆ కారణంగా తారకరత్నకు బ్లీడింగ్.. పరిస్థితి ఎలా ఉందంటే..

శుక్రవారం రోజు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో నందమూరి తారకరత్న ఊహించిన విధంగా ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం అందరికీ షాక్ కు గురిచేసింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇక కుప్పంలో అతనికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఇక అక్కడ ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో తారకరత్నకు చికిత్సను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన బులిటెన్ కూడా విడుదలయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

24 గంటలు గడిస్తే..

నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఊహించని విధంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించే మళ్లీ సాదరణ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారు. ఇక 24 గంటలు గడిస్తే గాని చెప్పలేము అని శుక్రవారం రోజు తెలియజేసిన వైద్యులు అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు పంపించాల్సి ఉంటుంది అని కూడా ముందుగానే వివరణ ఇచ్చారు.

తారకరత్న ఆరోగ్యంపై..

తారకరత్న ఆరోగ్యంపై..

ఇక తారకరత్న వీలైనంత త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు తారకరత్నకు సంబంధించిన ఆరోగ్యం విషయం గురించి వైద్యులతో మాట్లాడుతున్నారు. ఇక బెంగళూరుకు కూడా బాలకృష్ణ ఆధ్వర్యంలోనే తారకరత్నను పంపించడం జరిగింది. ఇక అక్కడ ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.

బీపీ కారణంగా బ్లీడింగ్

బీపీ కారణంగా బ్లీడింగ్

ఇక బెంగళూరు వైద్యనిపుణుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉదయ్ కనల్కర్, రఘు బృందం ఆధ్వర్యంలోనే తారకరత్నకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ముఖ్యంగా తారకరత్నకు బీపీ అధికంగా ఉండడం ద్వారానే బ్లీడింగ్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రత్యామ్నాయంగా ఎక్మో చికిత్స

బిపి లెవెల్స్ అధికంగా ఉండడం కారణంగా తారకరత్నకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని గుండెపోటు కారణంగానే ఈ విధంగా తీవ్ర రక్తస్రావంతో తారకరత్న బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇక ఆ సమస్యలను నియంత్రించడానికి వైద్యులు ప్రతిక్షణం కూడా వారి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ఎక్మో చికిత్సలో తారకరత్న ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇక తారకరత్న వీలైనంత త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ పరిస్థితిలోకి రావాలి అని కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

బాబాయ్ కు ఎన్టీఆర్ ఫోన్ కాల్

బాబాయ్ కు ఎన్టీఆర్ ఫోన్ కాల్

ఇక తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలకృష్ణకు ప్రత్యేకంగా ఫోన్ చేసే తన అన్నయ్యకు ఎలా ఉందో అడిగి కూడా తెలుసుకున్నట్లుగా సన్నిహితుల ద్వారా తెలిసింది. ఒక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పటికే బెంగళూరుకు బయలుదేరినట్లు కూడా సమాచారం అందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X