Taraka Ratna Health Update: నేటి వైద్యపరీక్షలు కీలకం.. ఆ తరువాత అసలు క్లారిటీ!
నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇక అతను కోలుకొని మళ్ళీ సాధారణ పరిస్థితుల్లోకి రావాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తారకరత్నకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక బెంగుళూరు NH హాస్పిటల్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ రోజు తారకరత్నకు చేసే వైద్య పరీక్షలు చాలా కీలకం కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు హాస్పిటల్ లో నందమూరి
తారకరత్న వీలైనంత త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు చాలా వరకు గత రెండు రోజుల నుంచి బెంగళూరు హాస్పిటల్ లోనే ఉన్నారు. అక్కడే వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.

పరిస్థితి కాస్త అదుపులోకి..
ఇక తారకరత్నకు హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆ తర్వాత ఇతర అవయవాలపై కూడా కొంత ప్రభావం చూపించినట్లుగా ఇదివరకే వైద్యులు వివరణ ఇచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా తారకరత్న శరీరం చికిత్సకు స్పందిస్తుందా లేదా అనే అనుమానాల మధ్యలోనే వైద్యులు వారి ప్రయత్నాలు కొనసాగించారు. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

నేడు చాలా కీలకం
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. మొన్నటి నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక నేడు వైద్యపరీక్షల తర్వాత పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చికిత్సకు తారకరత్న శరీరం ఇప్పుడు కాస్త ఎక్కువ స్థాయిలోనే స్పందిస్తున్నట్లుగా వైద్యులు తెలియజేశారు. నేడు వైద్య పరీక్షలు చాలా కీలకమని కూడా తెలియజేశారు. ఇక నేటి వైద్య పరీక్షల అనంతరం పూర్తి స్థాయిలో తారకరత్న ఆరోగ్యం విషయంలో ఒక క్లారిటీ రానుంది అంటున్నారు.

బాలకృష్ణకు ఫోన్ చేసి
తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పటికప్పుడు నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసి మరి అడిగి తెలుసుకుంటున్నారు. ఆదివారం రోజు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా వారి ఫ్యామిలీతో కలిసి బెంగళూరు హాస్పిటల్ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక అక్కడే చాలాసేపు వారు తారకరత్న ఆరోగ్యం పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడటం జరిగింది.

త్వరగా కోలుకుంటారని..
నిన్నటి వరకు అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది అని మరోసారి గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్యులు చాలా జాగ్రత్తగా తారకరత్నకు నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్లుగా తెలియజేశారు. మొదట కుప్పంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కార్యకర్తలకు చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్లీ అత్యాధునిక చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తారకరత్నను తరలించారు. ఇక ఆయన త్వరగా కోలుకుంటారు అని నందమూరి బాలకృష్ణ కూడా దీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











