Alekhya Taraka Ratna : షాకింగ్ లుక్‌తో తారకరత్న భార్య .. అలాంటి మేకోవర్‌తో!
నందమూరి తారకరత్న కన్నుమూసి అప్పుడే రెండేళ్లు కావొస్తోంది. ఇష్టపడి, పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య , వీరి దాంపత్యానికి గుర్తుగా పుట్టిన పిల్లలు తారకరత్న మరణంతో దిక్కులేని వాళ్లు అయ్యారు. తల్లి తండ్రి తానే అయి పిల్లలే లోకంగా బతుకుతున్నారు అలేఖ్య. భర్త జ్ఞాపకాలు, ఆయనతో గడిపిన క్షణాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలేఖ్య నందమూరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. దీంతో టీడీపీ కేడర్ ఆయనను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి అక్కడి నుంచి బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు తారకరత్న.

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్లపాటు కుటుంబాలకు దూరంగా ఉన్నారు తారకరత్న - అలేఖ్య రెడ్డి దంపతులు. ఇప్పుడు భర్త కూడా దూరం కావడంతో అలేఖ్య బాధ వర్ణనాతీతం. భర్తతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు అలేఖ్య. సోషల్ మీడియాలో నిత్యం తారకరత్న ఫోటోలు, వీడియోలు, ఎమోషనల్ పోస్టులను పెడుతుంటారు. అయితే కుటుంబ బాధ్యతలు , ఇతరత్రా పనులతో బిజీ అవుతున్న అలేఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తారకరత్న మరణం తర్వాత ఇటీవల వారి కుటుంబంలో తొలి శుభకార్యం జరిగింది. తారకరత్న - అలేఖ్య దంపతుల పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కూతురిని అందంగా ముస్తాబు చేశారు అలేఖ్య . పూల జడతో , సాంప్రదాయబద్ధంగా నగలు ధరించి హాఫ్ శారీలో 16 అణాల తెలుగమ్మాయిలా లక్ష్మీదేవిలా ఉంది నిష్క. తండ్రి తారకరత్న చిత్రపటానికి నివాళులర్పించిన నిష్క.. ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.
తాజాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న చిల్డ్రన్స్ డేని సెలబ్రెట్ చేశారు అలేఖ్య. పిల్లలతో పాటు తాను కూడా ఒకే కలర్ డ్రెస్ ధరించి చిన్న పిల్లలా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బ్లూ కలర్ జీన్స్, వైట్ చెక్స్‌తో ఉన్న షర్ట్ వేసిన అలేఖ్య.. తన కుమార్తెకు అక్కలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైతేనేం.. అలేఖ్య తన జీవితంలో చోటు చేసుకున్న విషాదం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలని నందమూరి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











