Tarakaratna No More: ఆ ఒక్క పొరపాటుతో మరణం వరకు తారకరత్న.. ఆ రోజే జాగ్రత్త పడి ఉంటే..
హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రలు అలాగే విలన్ పాత్రలు చేసిన తారకరత్న మళ్లీ రాజకీయ నాయకుడిగా కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని ఎంతో బలంగా సిద్ధమయ్యాడు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే నందమూరి తారకరత్న ఇంతకుముందు పెద్దగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది లేదు. అయితే ఆయన చేసిన ఒకే ఒక్క నిర్లక్ష్యం ఆరోజు తీవ్ర ప్రమాదంలోకి నెట్టివేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి నుంచి కూడా..
నందమూరి తారకరత్న నటుడిగా ఒకేసారి 9 సినిమాలతో లాంచ్ అవడం అప్పట్లో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గా నమోదయింది. ఇక అతను మొదటి నుంచి కూడా ఎంతో సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేశాడు. బయట ఎక్కువగా మీడియాలో కూడా కనిపించేవారు కాదు. తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా తన ప్రైవేట్ లైఫ్ ను కొనసాగించేవారు అని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో పాజిటివ్ గా చెప్పేవారు.

హీరోగా ఫెయిల్ అయినా..
ఇక నందమూరి తారకరత్న మొదట హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ కూడా తన నమ్మకాన్ని కోల్పోలేదు. ముందు నటుడిగా తనను తాను సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకోవాలి అని అమరావతి సినిమాలో ఒక భయంకరమైన విలన్ పాత్రలో నటించాడు. ఆ సినిమాకు గాను అతనికి బెస్ట్ విలన్ గా నంది అవార్డు కూడా లభించింది.

క్రియాశీలక రాజకీయాల్లో..
ఇక తారకరత్న నటుడిగా కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో కూడా బిజీ అవ్వాలని అనుకున్నాడు. పూర్తిస్థాయిలో తన స్టైల్ ను మార్చేసి రెగ్యులర్ గా పార్టీ మీటింగ్స్ లో పాల్గొంటూ కార్యకర్తలతో కూడా తన స్నేహ సంబంధాలను పెంచుకున్నాడు. ఒక కార్యకర్తగానే అతను తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే అనుకున్నట్లు కొన్ని కథనాలు అయితే వచ్చాయి.

ఆ రోజు పాదయాత్రలో
అయితే జనవరి 27వ తేదీన నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. బావతో కలిసి అతను మొదటి నుంచి కూడా చాలా సన్నిహితంగా తిరుగుతూ పాదయాత్రకు సంబంధించిన అనేక ప్రణాళికల్లో చర్చల్లో పాల్గొన్నాడు. ఇక ఆరోజు కూడా అతను ఎంత ఉత్సాహంగా బావతో కలిసి అడుగులు వేశాడు.

ఆ రోజు ఉదయమే..
ఇక పాదయాత్ర మొదలైన కొద్దిసేపటికే తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అయితే ఆ ఉదయమే అతనికి కొంత అస్వస్థతగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేదు. చిన్న సమస్య ఏదో అయ్యి ఉంటుంది అని అతను ఎవరితో కూడా చెప్పుకోలేదు. దీంతో యాత్రకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటూ బిజీ అయిపోయాడు. తనను తాను మర్చిపోయి జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించాడు. ఇక ఎండలో తిరగడం వలన గుండెపై అతని అనారోగ్యం మరింత ప్రభావం చూపించింది.

ఆ రోజే జాగ్రత్తపడి ఉంటే..
తారకరత్న అదే రోజు కాస్త జాగ్రత్త పడి ఆరోగ్యం గురించి కాస్త ఆలోచించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు అని కూడా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. కానీ అలా జరుగుతుంది అని తారకరత్న కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే అతనికి పెద్దగా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునేవాడు అని సన్నిహితులు చెబుతున్నారు.

ప్రాణాలతో పోరాడుతూ..
ఇక జనవరి 27వ తేదీన గుండెలో కాస్త నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్న ఆ తర్వాత సమీప ఆసుపత్రిలో కొంత చికిత్స తీసుకున్నాడు. ఇక తర్వాత అతని పరిస్థితి బాగుందని కూడా వైద్యులు కొంత భరోసా ఇచ్చినప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగా మారడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు. ఇక అక్కడ 23 రోజుల వరకు చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడిన తారకరత్న తుది శ్వాస విడిచారు. ఇక తారకరత్న మృతిపట్ల ప్రముఖ టాలీవుడ్ నటులు రాజకీయ నాయకులు నివాళులర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











