సెట్ లోనే నటుడి చెంప పగలకొట్టిన నందినీ రాయ్... అసలు ఏమైందంటే?

టాలీవుడ్‌లో సరయిన ఆఫర్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నటీమణుల్లో నందినీ రాయ్ ఒకరు. ఆమె అనేక సినిమాల్లో నటించినా సరే సరయిన బ్రేక్ లభించలేదు. అయితే తాజాగా సెట్ లో ఆమె ఒక నటుడి చెంప పగలకొట్టగా సదరు నటుడు కూడా ఆమె చెంప పగలకొట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

 తెలుగమ్మాయే

తెలుగమ్మాయే


హైదరాబాదులోని ఒక సింధీ కుటుంబంలో జన్మించిన నందినీ రాయ్ పై చదువుల కోసం లండన్‌ వెళ్లి అక్కడ ఫైనాన్స్ లో ఎం.బి.ఏ. డిగ్రీని పూర్తి చేసింది. ఇక మోడలింగ్ మీద ప్రేమతో దాదాపు 80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా పని చేసిన నందిని, అనేక అందాల పోటీలలో కూడా గెలిచింది.

టాలీవుడ్ ఎంట్రీ అలా

టాలీవుడ్ ఎంట్రీ అలా

దీంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 040, హార్మోన్స్, మాయ, మోసగాళ్ళకు మోసగాడు అనే తెలుగు సినిమాల్లో నటించింది. అయినా తెలుగులో పెద్దగా పేరు మాత్రం దక్కలేదు. అయితే ఆమె ఇప్పుడు ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది.

డిజిటల్ లో ముందే ఎంట్రీ

డిజిటల్ లో ముందే ఎంట్రీ

గతంలోనే ఆమె హై ప్రీస్టెస్ అనే ఒక సిరీస్ లో నటించినా అందులో కూడా ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం దక్కలేదు. అయితే బిగ్ బాస్ లో ఎంటర్ అవడం ద్వారా ఆమె కాస్త క్రేజ్ సంపాదించింది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ రెండవ సీజన్ లో ఎంటర్ అయిన ఆమె కొన్ని రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది.

 ఇన్ ది గేమ్ ఆఫ్ గాడ్

ఇన్ ది గేమ్ ఆఫ్ గాడ్

ఇక తాజాగా ఈ భామ ఈరోజే విడుదలయిన "ఇన్ ది గేమ్ ఆఫ్ గాడ్" అనే కొత్త వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ లో నటించింది. ఇక ఈ సిరీస్ కు సంబందించిన ఒక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఈ సిరీస్ కోసం షూటింగ్ సమయంలో కెమెరా ముందు నందిని మరియు ఆమె సహనటుడు వికాస్ ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారట.

ఒకరి చెంప ఒకరు వాయించుకుని

ఒకరి చెంప ఒకరు వాయించుకుని

అయితే అలా కొట్టుకోవడం ఒకరి మీద ఒకరికి కోపం వలనో లేక ఒకరినొకరు ద్వేషించుకోవడం వలనో కాదు, వారి సిరీస్ కోసం అలా కొట్టుకున్నారట. ఎందుకంటే ఒక సీన్ చాలా సహజంగా రావడం కోసమే వారు ఒకరినొకరు కొట్టుకున్నారట. అలా చేస్తేనే సీన్ పండుతుందని భావించి అలా ఒకరినొకరు కొట్టుకున్నారని నందినీ రాయ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అందుకే అలా కొట్టుకున్నాం

అందుకే అలా కొట్టుకున్నాం

ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వికాస్ నన్ను సున్నితంగా కొట్టినప్పుడు, మేము నిజమైన భావోద్వేగాలను బయటకు తీసుకురాలేదని భావించామని చెప్పుకొచ్చింది. అప్పుడే మేము ఇద్దరం చర్చించుకుని నిజంగా కొట్టుకోవాలని ఫిక్స్ అయ్యామని చెప్పుకొచ్చింది. ఆ సీన్ లో ఇద్దరి కళ్ళలో వచ్చిన కన్నీళ్లు నిజమైన కన్నీళ్లు అని చెప్పుకొచ్చింది. ఇక అలా నిజంగా ఒకరినొకరం కొట్టుకోవడం వలన చెంపలు వాచిపోయాయని, చెంపలు వాచిపోవడంతో దర్శకుడు ఒక అరగంట షూటింగ్ కి బ్రేక్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X