Just In
- 4 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 29 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరును మెప్పించని దర్శకురాలు.. మీడియాపై కౌంటర్ వేసిన నందినీ రెడ్డి
టాలీవుడ్‌లో లేడీ దర్శకులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందులో సక్సెస్ అయిన వారి శాతం మరీ తక్కువ. అలాంటి మహిళా దర్శకుల్లో నందినీ రెడ్డి శైలి ప్రత్యేకత. అలా మొదలైందితో దర్శకురాలిగా ప్రయాణం మొదలు పెట్టింది. మొదటి చిత్రమే మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఆరేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది.

ఓ బేబీతో మళ్లీ ఫామ్‌లోకి..
కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఓ బేబీని నందిని రెడ్డి.. తెలుగు నేటీవిటికి తగ్గట్టు చక్కగా మలిచింది. సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా మలచడంతో నందిని రెడ్డి విజయవంతమైంది. ఓ బేబీ విజయంతో మళ్లీ నందిని రెడ్డి పేరు ఇండస్ట్రీలో బాగానే వినిపించసాగింది.

తదుపరి ప్రాజెక్ట్‌పై వార్తలు..
ఓ బేవీ వంటి భారీ హిట్టు కొట్టాక నందిని రెడ్డి మరిన్ని అవకాశాలు అందుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నా ఎందుకనో ఇంకా ఏదీ ఓకే కావడం లేదని టాక్. ఇప్పటికే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసి గతంలో మెగాస్టార్ చిరంజీవి కి వినిపించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మెచ్చని చిరు..
ఆ స్క్రిప్టులో లోపాలున్నాయని.. మార్పు చేర్పులపై మెగాస్టార్ కొన్ని సూచనలు చేశారని ప్రచారం సాగింది. అయితే ఆ మేరకు మార్పులు చేశాక నందిని రెండోసారి చిరుని కలిశారనీ, అయినా ఏమైందో.. చిరును కన్విన్స్ చేయలేకపోయిందని టాక్ వినిపిస్తోంది. అప్పటికి చిరు మరిన్ని సలహాలు ఇచ్చి మళ్లీ మార్పులతో రమ్మని పంపిచేసారు. తాజాగా మరోసారి మార్పుల అనంతరం చిరుకు బౌండెడ్ స్క్రిప్టు ని నందిని రెడ్డి నేరెట్ చేశారట. కానీ ఈసారి కూడా సేమ్ రిజల్ట్. స్క్రిప్టుతో మెగాస్టార్‌ని మెప్పించడంలో తడబాటు కు గురయ్యారని ప్రచారమవుతోంది.

కౌంటర్ వేసిన నందినీ..
ఇలా తన తదుపరి ప్రాజెక్ట్‌పై కథనాలు రాసే వారిపై సెటైరికల్‌గా స్పందించింది. రైటర్స్, డైరెక్టర్స్ స్టోరీస్ రాయాలి కానీ వారి కంటే మీడియా వారే ఎక్కువ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇష్టమొచ్చిన కథనాలు రాస్తున్నారు.. కానివ్వండి.. ఇంకా ఏం రాస్తారా? అని ఎదురుచూస్తున్నాను అంటూ త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తానని చెప్పుకొచ్చింది.