సమంత సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ టాపిక్.. నందిని రెడ్డి ఏమందంటే
యంగ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా 'ఓ బేబీ'. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతకు జతగా నాగశౌర్య నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమంత కూడా ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతోంది. జులై 5 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.
ఇందులో భాగంగా తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించింది డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ ప్రస్తావన తీసుకొచ్చింది. ప్రభాస్ అన్నా, అతని నటన అన్నా తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ ది గ్రేట్ హీరో అని ఆమె పేర్కొంది. కాగా 'ఓ బేబీ' ప్రమోషన్స్ లో ప్రభాస్ మ్యాటర్ తీసుకొచ్చింది కేవలం ఆ సినిమాకు హైప్ తీసుకురావడం కోసమే అంటూ కొందరు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.

ఇటీవలే బాహుబలి సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం
సుజీత్ దర్శకత్వంలో 'సాహూ' సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి అగ్ర తారలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











