విరాట పర్వం నుంచి అప్‌డేట్.. అదొక్కటే కష్టంగా ఉందన్న నటి
నీదీ నాదీ ఒకే కథ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఊడుగుల.. తన తదుపరి చిత్రాన్ని అదే రీతిలో మలుచుతున్నట్లు కనిపిస్తోంది. 1992 నేపథ్యంలో జరిగిన కథ ఆధారంగా విరాట పర్వం అనే సినిమాను రానా, సాయి పల్లవి వంటి ప్రతిభావంతులతో చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన రానా ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
విరాట పర్వం సినిమా షూటింగ్ నుంచి లీకైన సాయి పల్లవి ఫోటోలు అప్పట్లో ఏ రేంజ్‌లో చక్కర్లు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక పాత్ర కోసం టబును సంప్రదించారని అయితే ఆమె ఒప్పుకోని కారణంగా నందితా దాస్‌కు ఆ ఆఫర్ వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా గానీ.. నందితా దాస్ విరాట పర్వంలో భాగమైంది.

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. షూటింగ్ గురించి స్పందిస్తూ.. విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల, కెమెరామెన్ డానీలతో సెట్‌లో ఉన్నాను.. తెలుగు మాట్లాడలేకపోవడమనేది ఒక్కటి తప్పా మిగతా అంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంద'ని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











