Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్షరంతో మార్పు దిశగా నందితాశ్వేత.. ఆ ముగ్గురే హైలెట్..
విద్యతో సామాజిక మార్పు సాధ్యం అవుతుందని నమ్మే అక్షర అందుకోసం ఏంచేసింది అనే కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సినిమా 'అక్షర'. బలమైన పాయింట్ చుట్టూ తిరుగుతూనే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఇన్ఫోటైన్మెంట్ గా సాగే సినిమాగా అక్షర రూపొందింది.
కంటెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ తో ప్రతి ఒక్కరినీ అలరిస్తూ ఆలోచింపచేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బి చిన్నికృష్ణ. సంక్రాంతి సందర్భంగా భోగి రోజు విడుదల చేసిన అక్షర మోషన్ పోస్టర్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ టీజర్ తోనే ప్రతిఒక్కరూ ఈ సినిమా గురించి చర్చించుకునేలా చేసింది.
ఇప్పటికే
మొదటి
షెడ్యూల్
పూర్తి
చేసుకున్న
అక్షర
మూవీ
ప్రస్తుతం
సెకండ్
షెడ్యూల్
షూటింగ్
జరుపుకుంటోంది.
నందిత
శ్వేత
ప్రధాన
పాత్రలో
నటిస్తోన్న
ఈ
మూవీ
సెకండ్
షెడ్యూల్లో
నందితతోపాటు
కీలక
పాత్రల్లో
నటిస్తోన్న
షకలక
శంకర్,
సత్య,
మధునందన్
పాల్గొంటున్నారు.
వీరి
పాత్రలు
సినిమాలో
హైలెట్‌గా
ఉంటాయని
చిత్ర
యూనిట్
పేర్కొన్నది.
సినిమా వినోద ప్రధానంగా సాగుతూనే హీరోయిన్‌కు అండగా నిలిచే యువకులుగా షకలక శంకర్, సత్య, మధునందన్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ''అక్షర'' షూటింగ్ త్వరలోనేపూర్తి కాబోతోంది.
ఇక మే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వేసవిలో వచ్చే అన్ని చిత్రాలతో పాటుఎంటర్టైన్మెంట్ ను అందిస్తూనే ఓ ప్రత్యేమైన అనుభూతిని ఇచ్చేలా తమ చిత్రం నిలుస్తుందని బలంగా నమ్ముతోంది ''అక్షర'' చిత్ర యూనిట్. నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రానికికెమెరామాన్: నగేష్ బెనెల్ ,మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్: జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి,కాస్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు,లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి,పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా.సి.ఎఫ్. ఓ: "యస్ మీడియా" సుమంత్. కో ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.