విద్యా వ్యవస్థపై నందితశ్వేత విమర్శనాస్త్రం.. ‘అక్షర’ రిలీజ్ ఎప్పుడంటే!
అందాల తార నందిత శ్వేత కీలక పాత్రలో నటిస్తున్న అక్షర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గతంలో విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముస్తాబైన ఈ చిత్రం గురించి నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. '' విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన కథ ఇది. నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండానే అద్భుతమైన మెసేజ్‌తో వస్తోన్న అక్షర షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన టీజర్, పాటకు వచ్చిన స్పందన మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇక సినిమా కూడా ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాం. ఇక సినిమాను అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాం'' అన్నారు.

దర్శకుడు బి చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ''అవుట్ పుట్‌పై మాకు పూర్తి సంతృప్తిగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్. మొత్తంగా అక్టోబర్ ద్వితీయార్థంలో వస్తోన్న మా అక్షర మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

నటీనటులు: నందిత శ్వేత, సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ తదితరులు
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన, దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.


Click it and Unblock the Notifications











