నాపై ఆ రకంగా అనుమానం.. ఓన్లీ గ్లామర్ రోల్స్ అంటూ నందిత శ్వేత
శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్. శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి 'వాసవి గ్రూప్' విజయ్‌కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... అశోక్ కుమార్ క్లాప్ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ ''నేను తమిళ్, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు 'మీరు తెలుగు సినిమాలు చేస్తారా? ఓన్లీ గ్లామర్ రోల్స్ ఉంటాయి?' అని అక్కడివారు అడిగేవారు. నేను వెయిట్ చేసి చేసి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటివరకూ గ్లామర్ కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించాను. ఫీమేల్‌కి వేల్యూ ఉన్న పాత్రలే చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్ రోల్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తా. మంచి మంచి యాక్టర్స్‌తో చేస్తున్నా. నేను నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది. నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్'' అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, కె. అశోక్‌కుమార్, అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, 'బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్, ఆదిత్యా మీనన్, అన్నపూర్ణమ్మ తదితరులు
స్టంట్స్: సతీష్
కూర్పు: ఆవుల వెంకటేశ్
కళా దర్శకుడు: కె.వి. రమణ
మాటలు: అంజన్
ఛాయాగ్రహణం: హరీష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ పేరు: లైట్ హౌస్ సినీ మేజిక్
సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్ మారియో
నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి


Click it and Unblock the Notifications











