టిక్ టాక్ ఎఫెక్ట్: పాపం తెగ ఫీల్ అవుతోంది.. హీరోయిన్ ఆవేదన
సెలెబ్రిటీలు, వారి వారి అప్‌డేట్ సంగతులంటే పడి చస్తుంటారు ఆడియన్స్. ఎప్పటికప్పుడు హీరోహీరోయిన్ల విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతుంటారు. ఎంత ఇష్టపడతారో ఒక్కోసారి అంతే దురుసుగా ట్రోల్స్ చేస్తుంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఆఫర్లు ఉన్నా, లేకున్నా, అందం ఆరబోసినా, దాచుకున్నా అన్నీ వింతగానే అనిపిస్తున్నాయి జనాలకు. వింతనో, విశేషమో తాము ఎలా ఫీల్ అయితే అది అందరి ముందరికి తీసుకురావడం మరో ఫ్యాషన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా తనపై చేస్తున్న కొన్ని వీడియోలు హీరోయిన్ నందితశ్వేతను తెగ భాదపెట్టిస్తున్నాయట.
''సినిమాల్లో నువ్వు ఎందుకు కనిపించడం లేదు.. నీకు సినిమా అవకాశాలు తగ్గి పోయాయా.. ఇక నీ పని తుస్సేనా'' అంటూ కొన్ని టిక్ టాక్ వీడియోలు నందిత కాంతిలో పడ్డాయట. ఇవి చూసిన నందిత బాగా హర్ట్ అయిందని తెలుస్తోంది. తాజాగా ఇలాంటి వీడియోలపై రియాక్ట్ అయిన నందిత.. ''ఇలాంటి వీడియోలు నాకు ఆవేదన కలిగిస్తున్నాయి. సినిమాలు చేయకపోతే మాకు మరే పని లేనట్లుగా జనాలు ఇలా భావించడం సరికాదు. మీరు పెడుతున్న ఇలాంటి కామెంట్స్ అవతలి వారిని ఎంతగా బాధ పెడతాయో వీరికి అర్ధం కాదా?'' అంటూ తన ఆవేదన వెళ్లగక్కింది.

పెద్ద పెద్ద స్టార్స్‌తో కలిసి నటిస్తేనే ఆమె ఒక హీరోయిన్ అని, కమర్షియల్ సినిమాలతో సక్సెస్ దక్కించుకుంటేనే సక్సెస్ అయినట్లని ప్రస్తుతం ప్రేక్షకులలో ఉన్న ఆలోచనలు కరెక్ట్ కాదని నందిత అభిప్రాయపడింది. మీరిలా ఆలోచించడమే గాక హీరోయిన్స్ పై ట్రోల్స్ చేయడం అనేది సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది నందిత. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే డేరింగ్ స్టెప్స్ వేస్తున్న నందితశ్వేత రియాయ్క్షన్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు సినీ విశ్లేషకులు.
కాగా పలు హర్రర్ సినిమాల్లో నటించడంతో పాటు చిన్న చిత్రాల్లో కూడా నటిస్తున్న నందితశ్వేత త్వరలోనే ఓ స్టార్ హీరోకు జోడీగా నటించనున్నాని ప్రకటించింది. తన కెరీర్ పట్ల తనకు పూర్తి నమ్మకముందని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











