విషాదంలో నందమూరి బాలకృష్ణ.. సోదరి మరణంతో ఉద్వేగానికి గురై కంటతడి
మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం మీడియాలో సంచలనం రేపింది. కొద్దికాలంగా డిప్రెషన్‌కు గురైన ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే మొదటి వివాహం విఫలం కావడంతో ఇటీవలనే ఉమామహేశ్వరి రెండో వివాహం చేసుకొన్నారు. ఈ వివాహానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉమామహేశ్వరి మరణించడం నందమూరి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
ఉమా మహేశ్వరి మరణవార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమా మహేశ్వరి నివాసానికి వెళ్లారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు, బాలకృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు.

నందమూరి బాలకృష్ణ విషాదవదనంతో కనిపించారు. ఆయన ముఖంలో సోదరి మరణం విషాదం నింపింది. నందమూరి బాలకృష్ణ ఉద్వేగంగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలు యూట్యూబ్‌లో కనిపించాయి.
ఉమా మహేశ్వరి పార్దీవ దేహం చేసిన బాలకృష్ట తట్టుకోలేక కంటతడి పెట్టినట్టు సన్నిహితులు చెప్పారు. ఓ వైపు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూనే బాలయ్య తనలో బాధను దిగమింగుకున్నారని తెలిసింది.
ఇదిలా ఉండగా, ఉమా మహేశ్వరి మరణాన్ని అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అయితే ఉమా మహేశ్వరి మరణంపై ఎలాంటి అధికారిక ప్రకటన కుటుంబ సభ్యులు చేయకపోవడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











