Jr NTR Vs Balakrishna Fans: జూ ఎన్టీఆర్ Vs బాలకృష్ణ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో హోరాహోరీ ఫైట్
పాన్ ఇండియా చిత్రంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై పాపులర్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో యష్ రాజ్ ఫిలింస్ నిర్వాహకులు, స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగమైన ప్రసంగంలో కొన్ని అంశాలు నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని గురి చేశాయి. దాంతో సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు హోరాహోరీగా ట్రోలింగ్ యుద్దం జరుగుతున్నది. ఆ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమకు శ్రీ రామోజీ రావుగారు పరిచయం చేస్తూ 25 ఏళ్ల క్రితం చూడాలని ఉంది అనే సినిమాను నిర్మించారు. ఆయన బ్యానర్‌లో ఓపెన్ అయిన ఆ మూవీ వేడుక రోజున నేను వెళ్తే.. నా పక్కన మా నాన్న హరికృష్ణ, మా అమ్మ షాలిని తప్ప ఎవరు లేరు. ఒక్కడినే వెళ్లాను. ఏం జరుగుతుందో.. ఎలా ఉండబోతుందో తెలియదు. అయితే ఇప్పటికీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే.. నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఎన్టీఆర్ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ నందమూరి అభిమానులు ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు తప్పుపట్టారు. ఆయన మొదటి సినిమాను నిర్మించింది రామోజీరావు. ఆయన రెండో సినిమాను రూపొందించి అశ్వినీదత్, రాఘవేంద్రరావు, ఆయన నాలుగో సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తే.. ఆ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన నటించిన 5వ సినిమా అల్లరి రాముడు మూవీ ఆడియో ఫంక్షన్‌కు చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. తారక్ నటించిన సింహాద్రి సినిమాకు టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా వ్యవహరించారు. ఇలా ఆరంభంలో అందరూ సపోర్టుగా నిలిచినప్పటికీ.. నా వెంట ఎవరూ ఎవరు లేరు అంటూ ఎలా చెబుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత.. ట్విట్టర్‌లో చాలా స్పేస్‌లతో నందమూరి అభిమానుల మధ్య ఇదే చర్చ జరిగింది. తన కెరీర్ ఆరంభంలో తాత, బాబాయ్ అంటూ చెప్పలేదా? వారి సహకారం లేకుండానే ఎన్టీఆర్‌కు అవకాశాలు వచ్చాయా? బాలయ్య అభిమానుల సపోర్టు లేకుండానే ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయా? ఆయన సినిమాలు నడిచాయా? టీడీపీ అభిమానుల సపోర్టు లేకుండానే ఎన్టీఆర్ సినిమాలు ఆడాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ట్విట్టర్ స్పేస్‌లో జూనియర్ ఎన్టీఆర్‌పై నందమూరి అభిమానులు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం నడిచి వచ్చిన బాటను ఎన్నడూ మరిచిపోకూడదు. బహిరంగ వేదికలపై ఆయన ఎలా అలా మాట్లాడుతారు. సమాజానికి తెలియదా? ఎవరు ఆయనకు సపోర్టు చేశారనే విషయం అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈవెంట్ తర్వాత బులి బులి బాలయ్య అంటూ కామెంట్ చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా రెండు వర్గాల మధ్య ట్రోలింగ్ యుద్దం ట్విట్టర్‌లో కొనసాగుతున్నది.
ఇలాంటి వివాదం మధ్య ఎన్టీఆర్ తొలిసారి నటించిన పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ కానున్నది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే తెలుగు సినిమా రంగానికి హృతిక్ రోషన్ కూడా పరిచయం అవుతన్నారు. ఇదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో వార్ 2 సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











