గ్యాంగ్ లీడర్‌గా నాని.. 24వ సినిమాకు చిరంజీవి టైటిల్‌తో సాహసం..
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో 24వ సినిమాగా నటిస్తున్న చిత్రం పేరును మైత్రీ మూవీస్ ప్రకటించింది. ఫిబ్రవరి 24వ తేదీ నాని జన్మదినం సందర్భంగా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. నాని 24వ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తారుమారు చేసిన సంగతి తెలిసిందే.

గ్యాంగ్ లీడర్ టైటిల్ సందర్భంగా నాని ట్విట్టర్‌లో స్పందించారు. గడ్డంతో చేతిలో వెల్డింగ్ గన్‌తో చిరంజీవి చేసిన మ్యాజిక్ నాకు ఇంకా గుర్తుంది. ఎప్పుడూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే నాకు ఆ సినిమా చరిత్రను ఎలా తిరగరాసిందో చెప్పనక్కర్లేదు. అలాంటి టైటిల్‌ను నా సినిమాకు పెట్టుకొని ప్రకటించడం నాకు గర్వంగా ఉంది అని అన్నారు.
తాజా నాని గ్యాంగ్ లీడర్ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతున్నది.


Click it and Unblock the Notifications











