Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
V సినిమాకు మరో రూ.7కోట్లు.. దిల్ రాజుకి వచ్చిన మొత్తం లాభం ఎంతంటే?
ఈ లాక్ డౌన్ కాలంలో ఓటీటీలో వచ్చిన అతి పెద్ద తెలుగు సినిమా V. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఆ తరువాత టైటిల్ కొత్తగా ఉండడం అలాగే సుధీర్ బాబు లాంటి టాలెంటెడ్ హీరో నానితో కలవడంతో ఇండస్ట్రీలో ఒక మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది V. ఇక లాక్ డౌన్ తరువాత చాలా రోజుల పాటు ఆలోచించి రిలీజ్ చేయగా ఈ సినిమా ఓటీటీలోకి రావడమే మంచిదయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి.
మార్కెట్ కూడా బాగానే సెట్టయ్యింది
దిల్ రాజు నిర్మించిన సినిమాలు చాలా వరకు నీరాశపరచవని అందరికి తెలిసిన విషయమే. ఇక దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి లాంటి దర్శకుడు నానితో కలిసి చేస్తున్న మూడవ సినిమా కావడంతో మార్కెట్ కూడా బాగానే సెట్టయ్యింది. కానీ థియేటర్ రిలీజ్ కి ఛాన్స్ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ తో మంచి డీల్ సెట్ చేసుకొని రిలీజ్ చేశారు.
థియేటర్స్ లో రిలీజయ్యి ఉంటే..
సినిమా కోసం 25కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్. ఇక అమెజాన్ ప్రైమ్ రూ.33.22కోట్లకు డిజిటల్ రైట్స్ అందుకొని దిల్ రాజుకి ప్రాఫిట్స్ వచ్చేలా చేసింది. నిజానికి ఈ సినిమాను చూసిన తరువాత థియేటర్స్ లో రిలీజయ్యి ఉంటే తప్పకుండా ప్లాప్ అయ్యి ఉండేదనే కామెంట్స్ వస్తున్నాయి. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై పెద్దగా పజిటీవ్ కామెంట్స్ కూడా చేయలేదు.
రాజమౌళి కూడా స్పందించలేదు..
ఓటీటీ విడుదలైన మొదటి పెద్ద సినిమా కాబట్టి బావుంటే తప్పకుండా రాజమౌళి, మహేష్ లాంటి వారు పాజిటివ్ గా కామెంట్స్ చేసేవారు. కానీ అందరూ సైలెంట్ గా ఉన్నారు. మొత్తంగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం దిల్ రాజును అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ని సేవ్ చేసిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.
Recommended Video
మరో 7కోట్ల లాభం
ఇక దిల్ రాజుకి బోనస్ గా శాటిలైట్ రైట్స్ ద్వారా మరికొంత లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జెమిని టీవీ V రైట్స్ ని ఇటీవల 7కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ విధంగా దిల్ రాజుకు V వలన థియేట్రికల్ రిలీజ్ లేకుండానే 15కోట్ల వరకు లాభం వచ్చినట్లు టాక్. చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలు డీజిటల్ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టె ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.