నాని టక్ జగదీశ్ షూటింగ్ స్టార్ట్: పూర్తి వివరాలివే..

నాని-శివ నిర్వాణ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో కొత్త సినిమా 'టక్ జగదీశ్'. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఇలా డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. షూటింగ్ ప్రారంభించక ముందే ఈ టైటిల్‌తో కూడిన పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు క్రియేట్ చేశారు. నాని కెరీర్‌లో 26వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా తాజాగా ఈ రోజు (జనవరి 30) ఈ 'టక్ జగదీశ్' మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ మీదకు వచ్చేసింది చిత్రయూనిట్. ఈ పూజా కార్యక్రమంలో హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ సహా దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తొలి షాట్‌కి దిల్ రాజు క్లాప్ కొట్టగా, నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫిబ్రవరి 11 నుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా ఫినిష్ చేస్తామని అంటోది చిత్రయూనిట్.

 Nani 26: Tuck Jagadish start

గతంలో ఇదే నాని-శివ నిర్వాణ కాంబినేషన్ 'నిన్నుకోరి' సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందింది. అదేబాటలో మళ్ళీ రెండో సినిమాతో పలకరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం శివ నిర్వాణ ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ నేపథ్యంలోనే తన స్క్రిప్ట్‌కి యాప్ట్ అయ్యేలా 'టక్ జగదీశ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారట శివ.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించనున్నారు. థమన్ సంగీతం సమకూర్చనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X